Reading Time: < 1 minute

హైదరాబాద్: తాను కూడా ఫోన్ ట్యాపింగ్ బాధితుడేనని ఎంఎల్‌ఎ వేముల వీరేశం తెలిపారు. ఫోన్ ట్యాపింగ్ విషయంలో బిఆర్ఎస్ నాయకులపై ఎంఎల్ఎ వీరేశం తీవ్ర విమర్శలు చేశారు. తెలంగాణకు డ్రగ్, పబ్ కల్చర్ తెచ్చింది కెటిఆరేనని విమర్శించారు. త్వరలో మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్‌ను కూడా విచారణకు పిలుస్తారని జోస్యం చెప్పారు. ఫోన్ ట్యాపింగ్ చేసి తెలంగాణ పరువు తీశారని, 2020 యాక్ట్ ప్రకారం కెటిఆర్ లొంగిపోతే మంచిదన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో విచారణకు హాజరవుతున్నారు. రెండో రోజుల క్రితం హరీష్ రావును సిట్ అధికారులు విచారించిన విషయం విధితమే.