Reading Time: 2 minutes

ఇండియాలో ఏకైక స్టార్ ఫోర్ట్… ఎక్కడుంది..? ఈ కోటలో రాకెట్ సీక్రెట్ ఏంటంటే..?

Caption of Image.

‘స్టార్ ఫోర్ట్’ ఇండియాలో ఒక్కటే ఉంది. దీనిని మైసూర్ పాలకుడు టిప్పు సుల్తాన్ కట్టించాడు. ఈ కోటకు గొప్ప చరిత్ర ఉంది. ఫ్రెంచ్ మిలిటరీ ఆర్కిటెక్చర్ తో కనువిందు చేసే ఈ కోట చెప్పే కథలెన్నో ఉన్నాయి. ఇది బ్రిటీష్ వారితో టిప్పు సుల్తాన్ సాగించిన యుద్ధాలకు ప్రత్యక్ష సాక్షి!

కర్నాటకలోని హసన్ జిల్లాలో ఉన్న మంజారాబాద్ పట్టణానికి దగ్గరలో స్టార్ ఫోర్ట్ ఉంది. ఈ కోట ఆర్కిటెక్చర్ స్టార్ షేప్ ఉంది. ఎనిమిది మొనదేలిన కొసలు ఉన్న ఈ కోట మిలటరీ అవసరాల కోసం కట్టారు. కాబట్టి గదులు దూరం దూరంగా ఉండేలా ఈ నక్షత్రాకారాన్ని ఎంచుకున్నారు. పేలుళ్లు, అగ్నిప్రమాదాలు జరిగినప్పుడు వాటి వ్యాప్తిని తగ్గించే ఉపాయం అన్నమాట. స్టార్ పోర్ట్ ని స్థానికులు మంజారాబాద్ ఫోర్ట్ అని పిలుస్తారు. ఈ కోటకు టిప్పు సుల్తాన్ యుద్ధ తంత్రాలకు విడదీయరాని సంబంధముంది.

సుల్తాన్ బలం

టిప్పు సుల్తాన్ 1750 నుంచి 1799 వరకు మైసూర్ రాజ్యాన్ని పాలించాడు. బ్రిటిష్ ప్రమాదం నుంచి రాజ్యాన్ని కాపాడేందుకు టిప్పు సుల్తాన్ సైన్యాన్ని బలోపేతం చేశాడు. ఆయుధ సంపత్తితో దాడి చేసే బ్రిటీష్ సేనలను ఎదిరించాలంటే సైన్యాన్ని పెంచుకోవడమే కాదు, ఆయుధాలను కూడా పెంచుకోవాలనుకున్నాడు.. శత్రువు కంటే బలమైన ఆయుధాల్ని ప్రయోగించాలని తలచాడు. అనుకున్నట్లే.. టిప్పు సుల్తాన్ 1792లో లోహపు కవచాలు గల రాకెట్లను (తగ్రఖ్) తన సైన్యంలో ప్రవేశపెట్టాడు. ఫిరంగులను కూడా తయారు చేయించాడు. బ్రిటిష్ వాళ్లు భారత భూభాగాన్ని ఆక్రమించడం కోసం చేసిన యుద్ధాలలో మైసూర్ యుద్ధాలు ముఖ్యమైనవి. ఈ యుద్ధాలలో తగ్రఖ్ చాలా కీలకం. దూరంగా ఉన్న శత్రువుపైకి దూసుకుపోయే తగ్రఖ్ దెబ్బకు బ్రిటిష్ సైన్యం చావుదెబ్బ తిన్నది. ఈగ్రఖి టిప్పు సుల్తాన్ బలం.

ఆ బలాన్ని పెంచిన కోట ఇదే!

కత్తులు, ఈటెలు, గదలు, రాతిగుళ్లలాంటి ఆయుధాలను భద్రపరిచే ఆయుధాగారంలో వీటిని దాచలేరు. తగ్రట్లు దూసుకుపోతాయి. పేలతాయి. కోటలో భద్రపరిస్తే పొరపాటుగా అంటుకుంటే కోటంతా నాశనం అవుతుంది. ప్యాలెస్ కాలి బూడిదవుతుంది. సైన్యంలోకి రాకెట్ టెక్నాలజీ కోసం ప్రయోగాలు చేస్తున్నట్టే వాటిని దాచిపెట్టడానికి ఆయుధాగారాన్ని కూడా సిద్ధం చేయాల్సి వచ్చింది. అట్లా టిప్పుసుల్తాన్ ఫ్రెంచి ఇంజినీర్లు డెవలప్ చేసిన పద్దతిలో ఆయుధాగారానికి అనుకూలంగా ఈ మంజారాబాద్ కోటని కట్టించాడు. ఈ కోటని కట్టడం 1785 లో మొదలుపెట్టారు.
1792లో పూర్తయింది. బలమైన రాతి గోడలతో కట్టిన ఈ కోట శత్రువులకు చిక్కకుండానే కాదు. మందుగుండు పేలినా తట్టుకునేంత గట్టిగా కట్టారు. అందుకే ఈ నాటికీ చెక్కు చెదరలేదు.

రాకెట్ సీక్రెట్

‘ఈ ప్రాంతాన్నే ఎందుకు ఎంచుకున్నాడు? అంటే.. ఇది సముద్రానికి దగ్గరలో, సముద్రమట్టానికి ఎత్తులో ఉంది. ఎప్పుడూ చల్లగా ఉండటం. పేలుడు జరిగినా అగ్ని వ్యాపించే అవకాశం తక్కువగా ఉంటుందని సకలేశపురకు దగ్గరలో కొండపై కోట కట్టించాడు.
”మంజు’ అంటే ‘మంచు’ అని అర్ధం. స్టార్ ఫోర్ట్ని. ఎల్లప్పుడూ (ఏడాదిలో ఎక్కువకాలం) పొగమంచు కప్పేస్తుంది. అందుకే ఈ కోటకి మంజారాబాద్ ఫోర్ట్’ అనే పేరొచ్చింది. ఏడాదిలో ఎక్కువ రోజులు మంచుతో ఉంది కాబట్టి ఈ కోటకు రాజు గారు ఏ పేరు పెట్టుకున్నారో కానీ, జనం మాత్రం మంజారాబాద్ ఫోర్ట్ అని పిలిచారు! ఇక్కడ ఏడాదంతా చల్లటి వాతావరణం వల్ల రాకెట్లను. (తగల్)లను) దాచిపెట్టడం సులభంగా ఉండేది.

ఇలా పోవచ్చు

ఈ ఫోర్ట్ సకలేశపూర్ పట్టణానికి నైరుతి దిక్కున 10 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇతర ప్రాంతాల టూరిస్టులు బెంగళూరు లేదా మంగళూరు చేరుకుని అక్కడి నుంచి ఈ ఫోర్టుకి ప్రయాణం చేయాలి. బెంగళూరుని మంగళూరుతో కలిపే జాతీయ రహదారి (ఎన్హెచ్ 75)పై హసన్ పట్టణం చేరుకోవచ్చు. హసన్ పట్టణం నుంచి 37 కిలోమీటర్లు ప్రయాణిస్తే సలకేశపూర్కి, అక్కడి నుంచి ట్రావెల్ చేస్తే మంజారాబాద్ ఫోర్డ్కి చేరుకోవచ్చు. బేలూరు నుంచి బిక్కోడుకి, అక్కడి నుంచి సకలేశపురకు చిన్న రోడ్డు మార్గంలో 42 కిలోమీటర్లు ట్రావెల్ చేసినా ఈ కోటకు చేరుకోవచ్చు.

== వెలుగు లైఫ్ 

©️ VIL Media Pvt Ltd.