Reading Time: < 1 minute

కేరళలో శశి థరూర్ పై దాడి.. ఐదుగురిపై కేసు..

Caption of Image.

కేరళలో కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ కాన్వాయ్ పై దాడి జరిగింది. కేరళలోని మలప్పురంలో శుక్రవారం ( ఏప్రిల్ 3 ) ఎన్నికల ప్రచారం చేస్తుండగా.. బైక్ పై వచ్చి  దాడి చేశారు దుండగులు. కాంగ్రెస్ అభ్యర్థి ఏపీ అనిల్ కుమార్ తరపున ఎన్నికల ప్రచారం చేస్తుండగా ఘటన జరిగింది. బైక్ పై వచ్చిన కొందరు దుండగులు శశి థరూర్ ను దూషిస్తూ..దాడికి పాల్పడ్డారు. కొంత దూరం నుంచి కాన్వాయ్ ని వెంబడిస్తూ వచ్చిన దుండగులు కారును అడ్డుకొని దాడికి పాల్పడ్డారు.

ఈ క్రమంలో కాన్వాయ్ పై దాడికి దిగిన దుండగులను అడ్డుకున్నాడు థరూర్ గన్ మెన్. సమాచారం అందుకున్న పోలీసులు ఒకరిని అరెస్ట్ చేసి కేసు నమోదు చేసినట్లు తెలిపారు. పోలీసులు అదుపులోకి తీసుకున్న నిందితుడు కలికాపు వాసి ఉమర్ గా గుర్తించినట్లు తెలిపారు. 

మరో ఇద్దరు అరెస్ట్

ఈ కేసుకు సంబంధించి మరో ఇద్దరిని  అరెస్ట్ చేసినట్లు తెలిపారు పోలీసులు. దాడి సమయంలో దుండగులు వాడిన రెండు కార్లను  స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు పోలీసులు.

ఈ ఘటనలో మొత్తం ఐదుగురిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. వాండూర్ లోని చెల్లితోడ్ దగ్గర రాత్రి 7 గంటల సమయంలో ఘటన జరిగింది. ఈ దాడి వెనుక ఏదైనా రాజకీయ వైరం, కుట్ర ఏమైనా ఉందా అన్నది తెలియాల్సి ఉంది.

©️ VIL Media Pvt Ltd.