Reading Time: < 1 minute
పబ్‌లో అర్ధరాత్రి ‘ఈగల్ టీమ్’దాడి! డ్రగ్ టెస్ట్‌లో నటి హేమకు ‘నెగెటివ్‌

హైదరాబాద్‌లోని కొండాపూర్ ప్రాంతంలో ఉన్న క్వాక్ అరేనా పబ్‌పై ఈగల్ టీమ్ అర్ధరాత్రి ఆకస్మిక దాడులు నిర్వహించింది. బ్లాక్ కాఫీ పేరుతో నైజీరియన్ డీజేతో ఒక ఈవెంట్ జరుగుతున్నట్లు గుర్తించిన పోలీసులు, పబ్‌లో ఉన్న సుమారు 64 మందికి డ్రగ్ పరీక్షలు జరిపారు. ఈ తనిఖీల్లో, ఎనిమిది మంది యువకులు డ్రగ్స్ తీసుకున్నట్లు పాజిటివ్‌గా తేలడంతో వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పబ్ ముసుగులో జరుగుతున్న అక్రమ కార్యకలాపాలపై నిఘా పెట్టిన ఈగల్ టీమ్, నిబంధనలు ఉల్లంఘించిన నిర్వాహకులపై కఠిన చర్యలకు సిద్ధమైంది. నగరంలో డ్రగ్స్ సంస్కృతిని అరికట్టే క్రమంలో భాగంగానే ఈ విస్తృత సోదాలు జరిగాయని అధికారులు వెల్లడించారు. ఈ దాడుల సందర్భంగా నటి హేమ పేరు బయటకు రావడం ఆసక్తి రేపింది. గతంలో బెంగళూరు డ్రగ్స్ పార్టీ వ్యవహారంలోనూ ఆమె పేరు తెరపైకి వచ్చింది. ఇప్పుడు ముందు జాగ్రత్తలో భాగంగా, హేమ ఒక వీడియోను విడుదల చేశారు. పబ్‌లో పాల్గొన్నప్పటికీ తాను డ్రగ్స్ తీసుకోలేదని, తన యూరిన్ శాంపిల్ నెగెటివ్ వచ్చిందని ఆమె స్పష్టం చేశారు.

మరిన్ని వీడియోల కోసం :

బాబోయ్‌.. గుడిలో పాములు..భక్తుల పరుగులు!

పొలం చదును చేస్తుండగా బరువుగా తగిలిన కుండ..లోపల చూడగా కళ్లు జిగేల్‌!

గ్రామంలో వింత తీర్మానం.. పోలీసుల పిలుపుతో మారిన సీన్‌

రండి.. నరికి సొరచేపలకు వేస్తాం.. అమెరికా సైనికులకు ఇరాన్‌ కవ్వింపు