Reading Time: < 1 minute

హైదరాబాద్: రంగారెడ్డి జిల్లాలో ఫుట్ పాత్ ఆక్రమణలపై జిహెచ్ఎంసి అధికారుల కొరడా ఝుళిపిస్తున్నారు. రాజేంద్రనగర్ లోని ఆరాంఘర్ వద్ద ఫుట్ పాత్ లపై ఆక్రమణలను జిహెచ్ఎంసి అధికారులు తొలగిస్తున్నారు. పోలీస్ బందోబస్తు మధ్య ఆక్రమణల తొలగింపు ప్రక్రియ కొనసాగుతుంది. కూల్చివేతల సందర్భంగా అధికారులు, చిరు వ్యాపారుల మధ్య వాగ్వాదం జరిగింది. రోడ్డును ఆక్రమించి డబ్బాలు ఏర్పాటు చేస్తే కఠిన చర్యలు తప్పవని అధికారులు వార్నింగ్ ఇచ్చారు.