
ఇరాన్ యుద్ధం కారణంగా ఇండియాలోని మెయిన్ సిటీల్లో జనజీవనం స్థంభించే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా బెంగళూరు సిటీలో ఎల్పీజీ గ్యాస్ స్టేషన్ ల దగ్గర కిలోమీటర్ల మేర లైన్లతో కిక్కిరిసిపోతున్నాయి. ఎక్కడ చూసినా నో గ్యాస్ బోర్డులు దర్శనమిస్తుండటంతో తీవ్ర ఆందోళనకర పరిస్థితులు ఏర్పడ్డాయి.
బెంగళూరు సిటీలో టోటల్ గ్యాస్ ఆధ్వర్యంలో నడిచే ఔట్లెట్స్ అన్నీ మూతపడ్డాయి. సూర్య గ్యాస్, సూపర్ గ్యాస్ పంపులలో పొద్దు పొద్దున్నే నో స్టాక్స్ బోర్డులు కనిపిస్తుండటం ఆందోళనకరంగా ఉంది.
వీటితో పాటు హిందుస్తాన్ పెట్రోలియం, భారత్ పెట్రోలియం బంకుల ముందు శుక్రవారం (ఏప్రిల్ 3) 3 కిలోమీటర్లే మేర వాహనాలు క్యూ కట్టాయి. యుద్ధం పరిస్థితుల్లో ఫుయెల్ ప్రైసెస్ భారీగా పెరిగాయి.
ప్రభుత్వ ఆధీనంలో నడిచే ఇండేన్,హెచ్ పీ, భారత్ పెట్రోలియం సంస్థలు లీటర్ ఎల్పీజీ 85 రూపాయలకు అమ్ముతున్నాయి. అదే సమయంలో ఇతర సంస్థల ఔట్లెట్లలో 120 నుంచి 125 రూపాయలకు అమ్ముతున్నారు. ప్రస్తుత సంక్షోభానికి ముందు ఎల్పీజీ ధర లీటర్ర కు 58 రూపాయలే ఉండేది.
- మూడు రోజులుగా స్టాక్ రాలేదు:
బెంగళూరులో పరిస్థితులపై గ్యాస్ స్టేషన్ల వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమకు మూడు రోజులు అయినా ఇప్పటి వరకు గ్యాస్ నిల్వలు రాలేదని చేతన్ గోవింద అనే వ్యక్తి తెలిపారు. గత కొన్ని వారాలుగా 4 టన్నుల గ్యాస్ రావాల్సి ఉండగా.. కేవలం 2 టెన్నులే వచ్చేదని.. ఇప్పుడు అది కూడా రావటం లేదని చెప్తున్నారు.
ఎల్ఎన్జీ స్టేషన్ల ముందు కిలోమీటర్ల మేర లైన్ల నిలబడటం కామనైపోయింది. చాలా మంది డ్రైవర్లు ఉదయం 5 గంటలకే వచ్చి లైనలో నిలబడుతున్నారు. కృష్ణ స్వామి అనే ఆటో డ్రైవర్ చెప్పిన వివరాల ప్రకారం.. రెండు రోజులుగా గ్యాస్ దొరకలేదు. రోజుల తరబడి గ్యాస్ కోసం ఎదురు చూస్తున్న అయినప్పటికీ నాకు దొరికింది కేవలం రెండు లీటర్లే. ఇది కేవలం 40 నుంచి 50 కిమీ వరకు మాత్రమే వస్తుంది. ఇలాగైతే టాక్సీ నడిపేదెలా.. పూట గడిచేదెలా అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.