
హైదరాబాద్: డెకాయిట్ సినిమాలో హీరో అడివి శేషు నటిస్తున్నాడు. ఈ సినిమాకు అతడి స్నేహితుడు శానిల్ దర్వకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీని విడుదల చేస్తున్న సందర్భంగా పెద్ద ప్రమోట్ చేస్తున్నాడు. ఏ చిన్న అవకాశాన్ని కూడా అడివి శేషు వదులుకోవడం లేదు. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ, కన్నడ, హిందీ, మలయాళీ బాషల్లో విడులు చేస్తున్నారు. తాజాగా సుమకు ఇచ్చిన ఇంటర్యూల్లో బహుబలి సినిమాలో అనుష్కతో నటించిన సన్నివేశాన్ని శేషు గుర్తు చేశారు. బహుబలి సినిమాలో భల్లాళదేవుడైన రానా కుమారుడిగా శేషు నటించారు. ఓ సన్నివేశంలో అనుష్క శేషు తన్నాల్సిన సీను ఉంది. తాను నెమ్మదిగా తన్నడంతో సీన్ పర్‌ఫెక్ట్ రాలేదని, ఫోర్స్‌పుల్‌గా తన్నామని డైరెక్టర్ రాజమౌళి చెప్పడంతో అనుష్కను గట్టిగా తన్నానని, సీన్ మాత్రం బాగా వచ్చిందని, ఆమె ముఖంలో ఎక్కడా బాధ కనిపించలేదని గుర్తు చేశారు. తాను తన్నినప్పుడు ఆమె మెడ భాగం వణికినట్లు కనిపించిందన్నారు. ఆమె పేరుకు తగ్గట్లే ఆమె చాలా స్వీటీ అని శేషు ప్రశంసించారు. దీనికి సంబంధించినే వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.