Reading Time: < 1 minute
జస్ట్ 10 మినెట్స్.. క్రిస్పీగా, కాస్త కారంగా ఉండే క్యాబేజీ, ఆనీయన్ పకోడి.. ఇలా చేస్తే టేస్ట్ అదిరిపోద్దంతే!

వీకెండ్ వచ్చిందంటే చాలూ ఇంట్లో పిల్లలు ఈవినింగ్ స్నాక్స్ కావాలని అల్లరి చేస్తూ ఉంటారు. వాళ్ల అల్లరి బరించలేక పేరెంట్స్ కూడా బయటకు తీసుకెళ్లి ఏదో ఒక స్ట్రీట్‌ ఫుడ్ తినిపిస్తారు. ప్రస్తుతం బయటఫుడ్‌లో ఎక్కవగా కల్తీ జరుగుతుంది. కాబట్టి పిల్లలకు ఇంట్లోనే ఏవైనా స్నాక్ చేసి పెట్టడం ఉత్తమం. కాబట్టి ఇప్పుడు మేం చెప్పబోయే ఈ ఈవినింగ్ స్నాక్‌ను మీరు ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఇది పిల్లల నుంచి పెద్దల వరకు అందరికి కచ్చితంగా నచ్చుతుంది. అంతే కాదు కరకరలాడుతూ, టేస్టీ టేస్టీగా ఉండే ఈ క్యాబీజీ ఆనియన్ పకోడీనికి మీరు చాలా తక్కువ సమయంలో చేసుకోవచ్చు. దీన్ని ఎలా తయారు చేయాలో స్టప్ బై స్టప్ చూద్దాం.

ఆనియన్ క్యాబేజీ పకోడికి కావలసిన పదార్థాలు

  • 1 కప్పు తరిగిన క్యాబేజీ
  • 1/2 కప్పు తరిగిన ఉల్లిపాయ
  • 1/2 కప్పు శనగపిండి
  • 3 టీస్పూన్ల బియ్యం పిండి
  • 3 సన్నగా తరిగిన పచ్చిమిర్చి
  • కొద్దిగా కొత్తిమీర
  • రుచికి సరిపడా ఉప్పు
  • వేయించడానికి సరిపడా నూనె

తయారీ విధానం:

ఇంట్లోనే కరకరలాడే ఆనియన్ క్యాబేజీ పకోడి తయారు చేసేందుకు మొదట క్యాబేజీ, ఉల్లిపాయ, పచ్చిమిర్చిని సన్నగా, పొడవుగా ముక్కలు కోసి పెట్టుకోవాలి. తర్వాత ఒక వెడల్పాటి గిన్నెలో తరిగిన క్యాబేజీ, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, ఉప్పు, శనగపిండి బియ్యం పిండి వేసి కొద్దిగా నీరు చిలకరిస్తూ పకోడీలు వేయడానికి వీలుగా (గట్టిగా) కలుపుకోవాలి.

ఇప్పుడు బాణలిలో నూనె పోసి బాగా వేడి చేయాలి. నూనె వేడెక్కిన తర్వాత, కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని చిన్న చిన్న పకోడీల్లా నూనెలో వేయాలి.పకోడీలు బంగారు రంగులోకి మారి, కరకరలాడే వరకు వేయించి తీయాలి. అంతే వేడివేడి, రుచికరమైన క్యాబేజీ పకోడీ సిద్ధంమైనట్టే.. దీనిని సాయంత్రం టీతో పాటు తింటే ఆహా ఆ ఫీలింగ్ అదిరిపోతుందంతే. ఈ సండే మీరు బయటకు వెళ్లకుండా ఇంట్లో ఈ క్యాబేటీ పకోడిని ట్రై చేయండి.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.