
భారతీయ సినీ పరిశ్రమ గర్వపడేలా రష్మిక మందన్న అంతర్జాతీయ స్థాయిలో మరో అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నారు. జపాన్‌లో అత్యంత ప్రతిష్టాత్మకమైన ‘క్రంచీరోల్ యానిమే అవార్డ్స్ 2026’ (Crunchyroll Anime Awards) వేడుకలో అవార్డులను అందజేసే ప్రజెంటర్‌గా రష్మిక ఎంపికయ్యారు. ఈ గౌరవం దక్కించుకున్న తొలి భారతీయ సెలబ్రిటీగా ఆమె రికార్డ్ సృష్టించారు. గతేడాది కూడా ఈ వేదికపై మెరిసిన రష్మిక, వరుసగా రెండోసారి ఈ ఆహ్వానాన్ని అందుకోవడం విశేషం.
Also Read : Sunny Leone: సన్నీ లియోన్ హాలీవుడ్ ఎంట్రీ.. అమెరికన్ ఓటీటీ సిరీస్ ‘ది జెయింట్’లో కీలక పాత్ర!
మే 23న టోక్యోలో అట్టహాసంగా జరగనున్న ఈ 10వ ఎడిషన్ అవార్డ్స్ వేడుకలో రష్మిక పాల్గొననున్నారు. యానిమేషన్ ప్రపంచంలో ‘ఆస్కార్’ వంటి గుర్తింపు ఉన్న ఈ వేదికపై ఆమె హాలీవుడ్ స్టార్లతో కలిసి విజేతలకు అవార్డులు అందించనున్నారు. స్వతహాగా పెద్ద యానిమే ఫ్యాన్ అయిన రష్మికకు, జపాన్‌లో ‘పుష్ప’ సినిమాతో విపరీతమైన ఫాలోయింగ్ పెరిగింది. ఆమె ఎనర్జీ, ఎక్స్‌ప్రెషన్స్ అక్కడి యానిమే క్యారెక్టర్లను పోలి ఉంటాయని జపనీస్ ఫ్యాన్స్ భావిస్తుంటారు.
ఈ వార్త బయటకు వచ్చిన నిమిషాల్లోనే నెట్టింట వైరల్ అయ్యింది. ముఖ్యంగా విజయ్ దేవరకొండ అభిమానులు “సూపర్ వదినమ్మ.. నీ రేంజ్ మామూలుగా లేదుగా!” అంటూ క్రేజీ కామెంట్స్ చేస్తూ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు. భారతీయ జెండాను అంతర్జాతీయ వేదికపై ఎగరేయడానికి సిద్ధమవుతున్న రష్మికకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.