Reading Time: < 1 minute

ముంబయి: మహారాష్ట్రలోని నాసిక్ ప్రాంతంలో కారు అదుపుతప్పి బావిలో పడింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన తొమ్మిది మంది దుర్మరణం చెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. డిండోరి ప్రాంతానికి చెందిన సునీల్ దత్తు (32) అనే వ్యక్తి తన భార్య రేష్మా, కుటుంబ సభ్యురాలు ఆశా, ఆరుగురు పిల్లలతో కలిసి కారులో శివాజీ నగర్ ఫంక్షన్‌కు వెళ్లారు. అక్కడి నుంచి తిరిగొస్తుండగా వీరి కారు అదుపుతప్పి బావిలో పడింది. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు, రెస్కూ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను బయటకు తీశారు. వీరంతా ఒకే కుటుంబానికి చెందిన వారిగా గుర్తించారు. దీంతో డిండోరి ప్రాంతంలో విషాదచాయలు అలుముకున్నాయి. బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు.