Reading Time: < 1 minute

హైదరాబాద్: రేవంత్ రెడ్డి ప్రభుత్వం బిఆర్‌ఎస్ నేతలను ఇబ్బంది పెట్టాలని చూస్తోందని బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ హరీష్ రావు మండిపడ్డారు. ఫోన్ ట్యాపింగ్ అనేది రాజకీయ ప్రేరేపిత కేసు అని విమర్శించారు. మమ్మల్ని వేధించిన అధికారులు రిటైర్ అయినా వదలబోమన్నారు. మళ్లీ వచ్చేది బిఆర్‌ఎస్ ప్రభుత్వమేనని, అధికారులు న్యాయబద్ధంగా వ్యవహరించాలని సూచించారు. మమ్మల్ని ఇబ్బందులు పెట్టిన అధికారులను వదిలేదే లేదని, సప్తసముద్రాల అవతల దాక్కున్నా పట్టుకుని వస్తామని, అధికారులు రేవంత్‌రెడ్డి డైరెక్షన్‌లో కాకుండా చట్టబద్దంగా వ్యవహరించాలన్నారు. రెండు రోజుల క్రితం ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్ రావును సిట్ అధికారులు ప్రశ్నించిన విషయం తెలిసిందే.