
పశ్చిమాసియాలో యుద్ధ జ్వాలలు మరింత భీకరంగా మారాయి. ఇరాన్‌ను “రాతియుగానికి పంపుతాం” అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించిన కొద్ది గంటల్లోనే, ఇరాన్ రాజధాని టెహరాన్ సమీపంలోని వ్యూహాత్మక లక్ష్యాలపై అమెరికా-ఇజ్రాయెల్ దళాలు విరుచుకుపడ్డాయి. ఈ దాడుల్లో కరాజు నగరంలో నిర్మాణంలో ఉన్న, మధ్యప్రాచ్యంలోనే అత్యంత ఎత్తైన బీ1 వంతెన పాక్షికంగా ధ్వంసమైంది. 36 మీటర్ల ఎత్తుతో టెహరాన్ పశ్చిమ నగరాలను అనుసంధానించే ఈ కీలక నిర్మాణం ఇరాన్‌కు గర్వకారణంగా నిలిచింది. మొదటి దాడి తర్వాత సహాయక చర్యలు చేపడుతుండగా, రెండోసారి కూడా బాంబుల వర్షం కురిపించడంతో భారీగా ప్రాణ, ఆస్తి నష్టం సంభవించినట్లు తెలుస్తోంది. ట్రంప్ స్వయంగా దీనికి సంబంధించిన దృశ్యాలను తన ట్రూత్ సోషల్ ఖాతాలో పోస్ట్ చేస్తూ, వంతెన కూలిపోయిందని, ఇక దాన్ని వాడలేరని పేర్కొన్నారు.
మరిన్ని వీడియోల కోసం :
బాబోయ్.. గుడిలో పాములు..భక్తుల పరుగులు!
పొలం చదును చేస్తుండగా బరువుగా తగిలిన కుండ..లోపల చూడగా కళ్లు జిగేల్!