
భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (బీఈఎల్) నాన్ -ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్ల కోసం అప్రెంటీస్‌షిప్ శిక్షణకు అవకాశం కల్పిస్తున్నది.
పోస్ట్ పేరు: ఇంజినీరింగ్ యేతర గ్రాడ్యుయేట్లకు అప్రెంటీస్ ట్రైనింగ్.
ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్ ఆఫ్ కామర్స్ లేదా బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ పూర్తిచేసి ఉండాలి.
గరిష్ట వయోపరిమితి: 25 ఏండ్లు. ఎస్సీ, ఎస్టీలకు ఐదు సంవత్సరాలు, ఓబీసీలకు మూడు సంవత్సరాలు పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు 10 సంవత్సరాలు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
అప్లికేషన్: ఆన్లైన్ ద్వారా.
లాస్ట్ డేట్: ఏప్రిల్ 10.
వాక్ ఇన్ ఇంటర్వ్యూ తేదీ: ఏప్రిల్ 10.
సెలెక్షన్ ప్రాసెస్: అకడమిక్ మెరిట్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
మరిన్ని వివరాలకు వెబ్‌సైట్www.bel-india.inను సందర్శించండి.