Reading Time: < 1 minute

ఆస్తి గొడవలతో భార్య, కూతురితో కలిసి విషం తాగిన భర్త.. సిద్దిపేట జిల్లా ములుగులో ఘటన

Caption of Image.

ములుగు, వెలుగు : ఆస్తి గొడవల కారణంగా ఓ వ్యక్తి తన భార్య, తొమ్మిది నెలల కూతురికి విషమిచ్చి తాను కూడా తాగి ఆత్మహత్యకు యత్నించాడు. ఈ ఘటన సిద్దిపేట జిల్లా ములుగులో శుక్రవారం సాయంత్రం జరిగింది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన కటికె శ్రీనివాస్‌‌ తన సోదరుడితో కలిసి తల్లి పేరిట ఉన్న 21 గుంటల భూమిని అమ్మేశాడు. 

ఇది తెలిసిన శ్రీనివాస్‌‌ సవతి తల్లి కుమారుడు అభ్యంతరం  వ్యక్తం చేశాడు. విక్రయించిన భూమిలో తనకు కూడా వాటా ఉంటుందని, చట్టరీత్యా చర్యలు తీసుకుంటానని శ్రీనివాస్‌‌ను హెచ్చరించాడు. దీంతో భయాందోళనకు గురైన శ్రీనివాస్‌‌ సోమవారం తన భార్య అనూష, తొమ్మిది నెలల కూతురు రుద్రాక్షకు విషం తాగించి, తానూ తాగాడు. గమనించిన గ్రామస్తులు ముగ్గురినీ లక్ష్మక్కపల్లి ఆర్వీఎం హాస్పిటల్‌‌కు తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం కొంపల్లిలోని ఓ హాస్పిటల్‌‌కు తరలించారు. ప్రస్తుతం ముగ్గురి పరిస్థితి సీరియస్‌‌గా ఉన్నట్లు తెలిసింది.

©️ VIL Media Pvt Ltd.