
బెంగళూరు: గతేడాది జూన్‌లో కర్ణాటకలో బైక్ ట్యాక్సీలపై నిషేధం విధించిన విషయం తెలిసిందే. అయితే సింగిల్ బెంచ్ ఇచ్చిన ఈ తీర్పును తాజాగా కర్ణాటక హైకోర్లు పక్కన పెట్టింది. కర్ణాటకలో బైక్ ట్యాక్సీ సేవలపై నిషేధాన్ని ఎత్తివేస్తున్నట్లు ఆదేశాలు జారీ చేసింది. అయితే ఇందుకగానూ పలు నిబంధనలు కూడా అమలు చేయాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వానికి సూచనలు చేసింది.
కొత్త నిబంధనల ప్రకారం.. బైక్ ట్యాక్సీలను ఇకపై వాణజ్య వాహనాలుగా పరిగణిస్తారు. బైక్ ట్యాక్సీలు ఉపయోగించేందుకు వాహన యజమానులు ముందుగా లైసెన్స్‌ల కోసం దరఖాస్తు చేసుకోవాలి. అగ్రిగేటర్లు కూడా కొత్త దరఖాస్తు సమర్పించుకోవాలి. మరి కర్ణక నిషేధం తర్వాత బైక్ ట్యాక్సీలకు పూర్వ వైభవం వస్తుందో.. లేదో.. వేచి చూడల్సందే.