
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాఖపట్నం జిల్లా గాజువాక జోనల్ ఆఫీస్‌లో స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మరెడ్డి పట్టాభి రామ్ సమీక్ష సమావేశంలో జివిఎంసి ఇంజినీర్ గుండెపోటుతో మృతి చెందాడు. ఈ సమావేశంలో జివిఎంసి సూపరింటెండింగ్ ఇంజనీర్ జి. గోవిందరావుకు ఛాతీలో నొప్పి వస్తుందని ఊపిరి ఆడడం లేదని చెప్పి కుప్పకూలిపోయాడు. వెంటనే అతడిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. అప్పటికే గోవిందరావు మృతి చెందినట్టు పరీక్షించిన వైద్యులు తెలిపారు.