
ప్రభుత్వ జూనియర్ కళాశాల చిత్రంతో హీరోయిన్ గా ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న షగ్నశ్రీ వేణున్ దర్శకురాలిగా మారి రూపొందిస్తున్న సినిమా ‘హలో ఇట్స్ మీ‘. ఈ సినిమాలో వరుణ్ సందేశ్ హీరోగా నటిస్తున్నారు. షగ్నశ్రీ హీరోయిన్ గా నటిస్తోంది. దర్శన్ మదమంచి మరో హీరోగా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఎస్ 2 ఎస్ సినిమాస్, శ్సాస్ ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై వీఎస్ కే సంజీవ్, వంగపల్లి సందీప్, వంగపల్లి సంకీర్త్ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్‌ను హైదరాబాద్‌లో జరిగిన ఈవెంట్‌లో లాంచ్ చేశారు. ఈ కార్యక్రమంలో హీరోయిన్, డైరెక్టర్ షగ్న శ్రీ వేణున్ మాట్లాడుతూ “మంచి కథా కథనాలతో ఈ సినిమా చేస్తున్నాను. ప్రతి అబ్బాయి, అమ్మాయికి ఈ మూవీ నచ్చుతుంది. యూత్ అంతా మా చిత్రానికి కనెక్ట్ అవుతారు”అని అన్నారు. హీరో వరుణ్ సందేశ్ మాట్లాడుతూ “ఇది క్లీన్ ఫ్యామిలీ మూవీ. యువతీ యువకులు ఒకరినొకరు అపార్థం చేసుకోవడం వల్ల ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అనేది షగ్న బ్యూటిఫుల్ గా ఈ మూవీలో చూపించింది”అని తెలిపారు. ఈ కార్యక్రమంలో హీరో దర్శన్ మదమంచి, సంజీవ్, సందీప్, రాజేశ్ జగన్నాథం, రాజశేఖర్, డా.భద్రమ్, జశ్వంత్ పాల్గొన్నారు.