Reading Time: < 1 minute

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తిరుపతిలో శ్రీవారి భక్తుడు అదృశ్యమయ్యాడు. తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్‌లో మిస్సింగ్ కేసు నమోదైంది. బిహార్ రాష్ట్రం దర్బంగ్ జిల్లాకు చెందిన 469 మంది ప్రత్యేక రైలులో తిరుపతికి వచ్చారు. తిరుమల శ్రీవారి దర్శనానంతరం తిరుపతికి చేరుకున్న భక్తులు వేరు వేరు చోట్ల పలు లాడ్జిలలో బస చేశారు. దేవి, షాబుకుమార్ దంప‌తులు శ్రీనివాసం ఎదురుగానున్న శ్రీహరి లాడ్జ్ రూమ్ నెంబర్ 303లో బస చేశారు. రూమ్ నుండి బయటకు వచ్చిన షాబుకుమార్ ఎంతసేపటికి రాకపోవడంతో స్నేహితులను భార్య దేవి ఆశ్రయించింది.  ఎంత వెతికినా షాబు కుమార్ (72) జాడ కనపడకపోవడంతో ఈస్ట్ పోలీసులకు భార్య సమాచారం ఇచ్చింది. క్రైమ్ నెంబర్ 57/2026 కేసు నమోదు చేసి ఈస్ట్ ఎస్ఐ ప్రసాద్ విచారిస్తున్నారు.