Reading Time: < 1 minute

హైదరాబాద్: ఎన్ని కేసులు పెట్టినా.. భయపడకుండా రాష్ట్రం కోసం పోరాడిన నాయకత్వం తమ పార్టీది అని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ కొనియాడారు. అనుక్షణం ప్రజలు, రాష్ట్రం కోసమే పనిచేశామని అన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పదేళ్లు రాష్ట్రం కోసమే పనిచేశామని, తాము ఎప్పుడూ తప్పుడు పనులు చేయలేదని తెలియజేశారు. రెండేళ్లు టైమ్ పాస్ చేసుకుంటూ వచ్చారని, తాము ఎప్పుడూ టైమ్ పాస్ కార్యక్రమాలు చేయలేదని అన్నారు. ప్రతిపక్షాలను ఎప్పుడూ వేధించలేదని, ఎంక్వైరీలకు భయపడేది లేదని కెటిఆర్ పేర్కొన్నారు. రాష్ట్రంలో పాలన పిచ్చోడి చేతిలో రాయిలా మారిందని విమర్శించారు. అప్పుడు దొరికిన ఆ దొంగ.. ఇప్పుడు ముఖ్యమంత్రి అయ్యాడని ఎద్దేవా చేశారు. రోజుకో అంశంలో డ్రామా చేస్తున్నారని, పుట్టిన భూమి సాక్షిగా తాను ఎప్పుడూ అక్రమ, అనైతిక పనులు చేయలేదని అన్నారు. తాను డ్రగ్స్ తీసుకుంటానని, హీరోయిన్లతో సంబంధాలు ఉన్నాయని వ్యక్తిత్వహననం చేశారని మండిపడ్డారు. ఫోన్ ట్యాపింగ్ పేరుతో డైలలీ సీరియల్ లా లీకులు ఇచ్చి తమ వ్యక్తిత్వహననం చేస్తున్నారని.. తన పరువు, ప్రతిష్టకు కలిగిన నష్టానికి ఎవరు బాధ్యులు అని కెటిఆర్ ప్రశ్నించారు.