
అమరావతి: ఎలక్ట్రానిక్స్ క్లీన్ మ్యానుఫ్యాక్చరింగ్ కు.. ఎపి నమ్మకమైన గమ్యస్థానం అని ఎపి మంత్రి నారా లోకేష్ తెలిపారు. డిజిటల్ వ్యవస్థలు పాలనకు కేంద్ర బిందువుగా మారాయని అన్నారు. దావోస్ రెన్యూ పవర్ ఆధ్వర్యంలో సమావేశంలో లోకేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎపికి..160 గిగావాట్ల పునరుత్పాదన శక్తి సామర్థ్యం ఉందని, భారత్ లోనే తొలి గ్రీన్ అమ్మోనియా టెర్మినల్ ఎపిలో ఉందని తెలియజేశారు. ప్రస్తుత ప్రపంచంలో మూడు ‘డి’ లు ప్రాముఖ్యత సంతరించుకున్నాయని, ఒక చారిత్రక దశలో ఉన్నామని అన్నారు. డిజిటలైజేషన్, డీకార్బనైజేషన్, డీ- గ్లోబలైజేషన్ ప్రాముఖ్యత సంతరించుకున్నాయని, ఆంధ్రప్రదేశ్ ఐటీ మంత్రిగా డిజిటలైజేషన్ తన ప్రధాన బాధ్యత అని పేర్కొన్నారు. డిజిటల్ వృద్ధికి భారీ ఇంధన అవసరం ఉంటుందని, డేటా సెంటర్లు, ఎఐ కంప్యూట్.. స్వచ్ఛమైన, నమ్మదగిన విద్యుత్ లేకుండా విస్తరించలేవని లోకేష్ స్పష్టం చేశారు.