
అమరావతి: సిఆర్ పిఎఫ్ కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్నమయ్య జిల్లాలో జరిగింది. పుంగనూరులో కానిస్టేబుల్ చెన్నారెడ్డి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. బిసివై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్‌కు వై ప్లస్ కేటగిరి గన్‌మెన్‌గా చెన్నారెడ్డి (28) పనిచేస్తున్నాడు. మృతుడు అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం వాసి అని పోలీసులు తెలిపారు.