
సిట్ విచారణకు ముందే కెటిఆర్ దొరికిపోయారని, ఎలాగో దొరికిపోతానని కెటిఆర్‌కు ముందే తెలుసనీ ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ అన్నారు. ఆయన గురువారం విలేకరులతో మాట్లాడుతూ ప్రతిపక్ష పార్టీ నాయకులు, ఎమ్మెల్యేల ఫోన్లు ట్యాప్ అయ్యాయని కెటిఆర్ పరోక్షంగా ఒప్పుకున్నారని ఆయన ఆరోపించారు. దేశ భద్రత, అంతర్గత భద్రత, ఉగ్రవాద కార్యకలాపాలు, మావోయిస్టులకు సంబంధించిన ఫోన్లను మాత్రమే పోలీసులు ట్యాప్ చేస్తారని, రాజకీయ కారణాలతో ప్రతిపక్ష నాయకులు, ఎమ్మెల్యేల ఫోన్లు ట్యాప్ చేయడానికి ఎట్టి పరిస్థితుల్లోనూ వీలులేదని ఆయన తెలిపారు. తెలంగాణ సమాజం ముందు నిజాలు బట్టబయలు అవుతాయని, కల్వకుంట్ల కుటుంబానికి జైలు శిక్ష తప్పదని ఆయన ఆరోపించారు. కెటిఆర్ మేగపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నారని ఆయన అన్నారు.