
తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ అధికారులు దూకుడు పెంచారు. ఈ కేసులో ఇప్పటికే పలువురు అధికారులను విచారించిన సిట్.. గురువారం బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెండ్ కెటిఆర్ కు నోటీసులు ఇచ్చింది. రేపు(శుక్రవారం, జనవరి 23) ఉదయం 11 గంటలకు విచారణకు రావాలని నోటీసులో సిట్ ఆదేశించింది. కాగా, రెండు రోజుల క్రితం ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ మంత్రి హరీష్ రావుకు నోటీసులు ఇచ్చిన సిట్.. నిన్న ఆయనను విచారించింది. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో విచారణకు హాజరైన హరీష్ రావును దాదాపు ఐదారు గంటల పాటు సిట్ అధికారులు ప్రశ్నించారు. ఈ సందర్భంగా తన ఫోన్ కూడా ట్యాప్ అయ్యిందని హరీష్ రావుకు సిట్ అధికారులు తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆయనతోపాటు అనుచరుల ఫోన్లు కూడా ట్యాప్ అయినట్లు చెప్పారు.