
మెల్‌బోర్న్: ఆస్ట్రేలియాలో కాల్పులు కలకలం సృష్టించాయి. న్యూ సౌత్ వేల్స్ రాష్ట్రంలోని లేక్ కార్గెల్లిగో పట్టణంలో గురువారం జరిగిన కాల్పుల్లో ముగ్గురు మరణించగా, మరొకరు గాయపడ్డారని పోలీసులు తెలిపారు. వాకర్ స్ట్రీట్‌లో కొందరు దుండగులు ప్రజలపై తుపాకీ కాల్పులు జరిగినట్లు సమాచారం అందడంతో వెంటనే సెంట్రల్ వెస్ట్ పోలీస్ డిస్ట్రిక్ట్ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన ఇద్దరు మహిళలు, ఓ వ్యక్తి మృతి చెందగా.. మరోకరు గాయపడ్డారు. పోలీసులు అతన్ని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. కాల్పుల అనంతరం దుండగులు పరారయ్యారు. ఘటన జరిగిన ప్రాంతాన్ని కంట్రోల్ లోకి తీసుకున్న పోలీసులు.. ప్రజలు ఇంట్లోనే ఉండాలని కోరారు. నిందితులను పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.