
రాంఛీ: ఝార్ఖండ్ రాష్ట్రం సింగ్భూమ్ జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. కిరీబురు పోలీస్ స్టేషన్ పరిధిలోని సారంటా అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు, మవోయిస్టులకు మధ్య జరిగిన కాల్పుల్లో 15 మంది మావోలు చనిపోయారు. మృతుల్లో మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు పతిరామ్ మాంఝీ అలియాస్ అనల్ ఉన్నారని తెలిపారు. అతడి తలపై ఐదు కోట్ల రూపాయల రివార్డు కూడా ఉంది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఘటనా స్థలం నుంచి భారీగా మందుగుండు సామాగ్రి, ఎకె47 తుపాకులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.