
అమరావతి: నిత్యజీవితంలో సాంకేతికత కీలకంగా మారిందని మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. మాల్ ప్రాక్టీస్ వంటివి జరిగితేనే ఈ సెంటర్ ద్వారా తక్షణం గుర్తించవచ్చు అని అన్నారు. కమాండ్ కంట్రోల్ సెంటర్ ను సత్యకుమార్ ప్రారంభించారు. కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా 37 వైద్య,విద్య కళాశాలల్లో పరీక్షలు పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మాల్ ప్రాక్టీస్ వంటివి జరిగితేనే కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా తక్షణం గుర్తించవచ్చునని, కాపీయింగ్, మాల్ ప్రాక్టీస్ కు అవకాశం లేకుండా చేస్తామని తెలియజేశారు. సాంకేతికతను ఉపయోగించడం వల్ల పర్యవేక్షణ సిబ్బంది సంఖ్య తగ్గనుందని, హైక్వాలిటీ నాణ్యతతో చిత్రీకరణతో పాటు 70 రోజులు వీటిని స్టోర్ చేయవచ్చునని అన్నారు. ప్రస్తుతం ఐదు వైద్య విద్యా కళాశాలలను ఈ సెంటర్ కింద తీసుకొస్తున్నామని, భవిష్యత్తులో అన్ని వైద్య, విద్యా కళాశాలల్లో కమాండ్ కంట్రోల్ సేవలు అందిస్తున్నామని పేర్కొన్నారు. త్వరలో ఆయుష్, నర్సింగ్ కళాశాలలను కమాండ్ పరిధిలోకి తీసుకొస్తామని అన్నారు. నాణ్యమైన వైద్య, విద్యను తీసుకురావాలన్నదే ప్రభుత్వ లక్ష్యం అని సత్యకుమార్ స్పష్టం చేశారు.