Reading Time: < 1 minute

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తిరుపతి జిల్లాలో జల్లికట్టులో విషాదం చోటుచేసుకుంది. ఎద్దు కుమ్మడంతో ఓ యువకుడు మృతి చెందాడు. పుల్లయ్యగారి పల్లెలో 16వ తేది జల్లికట్టులో ఎద్దు కుమ్మడంతో  రవి(56) తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే అతడిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళంకు చెందిన రవి(56) ఇవాళ మృతి చెందాడు. ​సంక్రాంతి వేడుకల్లో భాగంగా నిర్వహించిన జల్లికట్టులో ఈ ఘటన జరిగింది. ​​రవి మరణంతో పుల్లయ్యగారి పల్లెలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఈ ​ఘటనపై చంద్రగిరి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.