Reading Time: < 1 minute

వరుస బ్లాక్‌బస్టర్‌లతో దూసుకుపోతున్న అడివి శేష్ ఇప్పుడు తన ప్రతిష్టాత్మకమైన చిత్రం ‘డకాయిట్’తో అలరించబోతున్నారు. ఈ చిత్రంతో షానియల్ డియో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఇందులో మృణాల్ ఠాకూర్ కథానాయికగా నటిస్తుండగా, ప్రముఖ దర్శకుడు అనురాగ్ కశ్యప్ ఒక ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి దశ లో ఉంది. తాజాగా మృణాల్ ఠాకూర్ తన పాత్రకు సంబంధించిన షూటింగ్‌ను పూర్తి చేసుకున్నారు. ఒక భారీ షెడ్యూల్‌లో తన షూటింగ్ పూర్తి చేశారు. చిత్ర బృందం ఆమె కు ఘనంగా వీడ్కోలు పలికింది. ఆమె తన పాత్రకు తెలుగు, హిందీ రెండు భాషలలో డబ్బింగ్ కూడా చెబుతున్నారు. ఇటీవల చిత్ర నిర్మాతలు రిలీజ్ చేసిన సినిమా టీజర్ కు అద్భుతమైన స్పందన లభించింది. శేష్ డిఫరెంట్ అవతార్, రఫ్ లుక్‌తో అందరినీ ఆకట్టుకున్నారు. ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్, అతుల్ కులకర్ణి, సునీల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సుప్రియ యార్లగడ్డ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సునీల్ నారంగ్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ ఈ చిత్రాన్ని సమర్పిస్తోంది. మార్చి 19న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానున్న ఈ చిత్రం, తెలుగు నూతన సంవత్సరం అయిన ఉగాది పండుగ సందర్భంగా గ్రాండ్‌గా విడుదలవుతోంది.