Reading Time: < 1 minute

నిహాల్ కోధాటి, సూర్య శ్రీనివాస్ హీరోలుగా అక్కి విశ్వనాధ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న యూనిక్ స్పై డ్రామా ’చైనా పీస్’. మూ న్ లైట్ డ్రీమ్స్ బ్యానర్ లో తెరకెక్కిన ఈ చిత్రం లో కమల్ కామరాజు, రఘు బాబు, రంగస్థలం మహేష్, శ్రీనివాస్ వడ్లమాని, శ్రీకాంత్ అయ్యంగార్ కీలక పాత్ర పోషించారు. తాజాగా మేకర్స్ ఈ సినిమా నుంచి భగ భగ సాంగ్ రిలీజ్ చేశారు. కంపోజర్ కార్తిక్ దేశభక్తి రగిలించేలా ఈ పాటని స్వరపరిచారు. కాల భైరవ పవర్‌ఫుల్ గాత్రం సాంగ్‌ని నెక్స్ లెవల్ కి తీసుకెళ్ళింది. ఫిబ్రవరి చివరలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.