
హైదరాబాద్: ఖమ్మం జిల్లా రఘునాథపాలెం, ఖమ్మం అర్బన్ మండలాలకు మహర్దశ పట్టింది. మంచుకొండ ఎత్తిపోతలతో భూములు సస్యశ్యామలం కానున్నాయి. రెండెళ్లనుకున్న పనులుపై ఏడాదిలోనే మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చొరవ చూపించారు. మంచుకొండ ఎత్తిపోతలను జాతికి అంకితం చేశారు. మంచుకొండ ఎత్తిపోతల పథకం ప్రారంభం చేసి.. వి. వెంకటాయపాలెం వద్ద తుమ్మల నాగేశ్వరరావు స్విచ్ ఆన్ చేశారు. మంచుకొండ లిప్ట్ ఇరిగేషన్ తో 35 చెరువులు నింపేలా ఏర్పాట్లు చేయగా, సాగర్ జలాలను మళ్లించి 2 పంటలకు సాగునీరందించేలా ఎత్తిపోతల పథకం అమలు చేశారు. మంచుకొండ లిప్ట్ తో 2,412 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందనుంది. భూగర్భ జలాలు పెరిగి, రెండు పంటలకు ఢోకా లేదని రైతుల హర్షం చేశారు.