Reading Time: < 1 minute

మెగాస్టార్ చిరంజీవి హీరోగా, సక్సెస్‌ఫుల్ దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కించిన చిత్రం ‘మన శంకరవరప్రసాద్ గారు’. సంక్రాంతి కానుకగా ఈ సినిమా జనవరి 12న విడుదలైంది. తొలి షో నుంచి సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చింది. చిరు యాక్టింగ్, అనిల్ మార్క్ టేకింగ్ ప్రేక్షకులను కట్టిపడేశాయి. ఇక అనిల్ రావిపూడి సినిమా అంటేనే కామెడీకి కొదవ ఉండదు. ఇవన్నీ కలగలిపి ఈ సినిమాని సూపర్ హిట్‌గా నిలిపాయి. ఈ సంక్రాంతికి అనిల్ రావిపూడి మరోసారి బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్నారు.

ఇక ఈ సినిమాకు కలెక్షన్ల వర్షం కురుస్తోంది. మొదటి రోజే రికార్డు స్థాయిలో కలెక్షన్లు రాబట్టింది. ప్రీమియర్స్‌తో కలిపి రూ.84 కోట్ల వసూళ్లు చేసినట్లు చిత్ర నిర్మాణ సంస్థ షైన్ స్క్రీన్స్ వెల్లడించింది. చిరంజీవి కెరీర్‌లోనే రెండో అతి పెద్ద ఓపెనింగ్‌గా ఈ సినిమా నిలిచింది. ఇందుకు సంబంధించి ఓ ప్రత్యేకమైన పోస్టర్‌ని విడుదల చేసింది. ఇక ఈ సినిమాలో నయనతార హీరోయిన్‌గా నటించగా.. విక్టరీ వెంకటేష్ ప్రత్యేక పాత్రలో అలరించారు. క్యాథరీన్ థ్రెసా, సచిన్ ఖేడ్కేర్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాని సాహు గారపాటి, సుస్మిత కొణిదెల సంయుక్తంగా నిర్మించారు. భీమ్స్ సంగీతం సమకూర్చాడు.