Reading Time: < 1 minute

న్యూఢిల్లీ : దేశంలో స్వాతంత్య్రానంతరం తొలిసారిగా దేశ ప్రధాన మంతి కార్యాలయం (పిఎంఒ) నివాస చిరునామా మారుతోంది. ఇప్పటివరకూ స్థానిక సౌత్ బ్లాక్ లోనే పిఎంఒ ఉంటూ వస్తోంది. ఇప్పుడు మకర సంక్రాంతి రోజున, 14వ తేదీన ప్రధాని మోడీ అధికారిక కార్యాలయం వేరే చోటికి మారుతుంది. సేవా తీర్థ్ కాంప్లెక్స్‌లో ప్రధాని కార్యాలయం ఉంటుందని అధికార వర్గాలు తెలిపాయి. సెంట్రల్ విస్టా రీడెవలప్‌మెంట్ ప్రాజెక్టులో భాగంగా ఈ నూతన కార్యాలయం ఏర్పాటు అయింది.

పిఎంఒతో పాటు ఇక్కడ కేబినెట్ సెక్రెటెరియట్, జాతీయ భద్రతా సలహాదారుతో పాటు దజాతీయ భద్రతా మండలి సచివాలయం (ఎన్‌ఎన్‌సిఎస్) కూడా ఉంటాయి. ఇవన్నీ కూడా వేర్వేరు భవనాలుగా ఉంటాయి. దేశ ప్రధాని సేవా భాననకు అనుగుణంగా దీనికి సేవాతీర్థ్ అనే పేరు పెట్టారు. పిఎంఒ అడ్రసు మార్పుతో ఓ పాత అధ్యాయం ముగిసినట్లు అవుతోంది. 1947లో సౌత్ బ్లాక్‌ను ప్రధాన మంత్రి కార్యాలయంగా ఏర్పాటు చేశారు. సేవా తీర్థ్‌లు మూడు భాగాలుగా ఉంటాయి. పిఎంఒ నెలకొని ఉండేది సేవాతీర్థ్ 1గా, కేబినెట్ సెక్రెటెరియట్ సేవాతీర్థ్ 2 గా, జాతీయ భద్రతా సలహాదారు కార్యాలయం సేవాతీర్థ్ 3గా ఉంటాయి.