Reading Time: < 1 minute

న్యూఢిల్లీ: మాజీ ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖర్ మరోసారి ఆస్పత్రిలో చేరారు. అనారోగ్యం కారణంగా సోమవారం ధన్‌ఖర్, ఢిల్లీలోని ఆల్-ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్)లో చేరారు. గత వారం రెండుసార్లు స్పృహ కోల్పోవడంతో ఆయనకు ఎంఆర్‌ఐ పరీక్షలు నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. జనవరి 10న, ఆయన వాష్‌రూమ్‌కు వెళ్లినప్పుడు “రెండుసార్లు స్పృహ కోల్పోయారు. ఈరోజు ఆయన చెకప్ కోసం ఎయిమ్స్‌కు వెళ్లగా, పరీక్షల నిమిత్తం ఆసుపత్రిలో చేరాలని వైద్యులు సూచించారు” అని ఓ అధికారి తెలిపారు.

గతంలో ఉపరాష్ట్రపతిగా ప్రజా కార్యక్రమాలకు హాజరైనప్పుడు కూడా రణ్ ఆఫ్ కచ్, ఉత్తరాఖండ్, కేరళ, ఢిల్లీ సహా జగదీప్ ధన్‌ఖర్ పలుమార్లు స్పృహ కోల్పోయారు. ఆ తర్వాత అనారోగ్యం కారణంగా ఉపరాష్ట్రపతి పదవికి ఆయన రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.