
మెగాస్టార్ చిరంజీవి మన శివశంకరప్రసాద్ సినిమా చూస్తూ సినిమా థియేటర్లోనే అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన కేపిహెచ్బి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఏపీ స్పెషల్ బెటాలియన్ లో అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్గా పనిచేసి రిటైర్డ్ అయిన ఎస్ ఆనంద్ కుమార్ సోమవారం ఉదయం కూకట్పల్లి అర్జున్ థియేటర్లో చిరంజీవి నటించిన శివశంకర వరప్రసాద్ సినిమా ను చూస్తుండగా అకస్మాత్తుగా గుండెపోటు వచ్చి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ విషయం తెలుసుకున్న థియేటర్ సిబ్బంది కెపిహెచ్బి పోలీసులకు సమాచారం అందించడంతో మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.