
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖను పూర్తిగా పారదర్శకంగా అవినీతి రహితంగా తీర్చిదిద్దుతున్నట్లు రాష్ట్ర రెవెన్యూ హౌసింగ్ సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. కూకట్పల్లి కైతలాపూర్ సమీపంలోని హౌసింగ్ బోర్డ్ స్థలంలో ఎస్‌ఎస్‌ఆర్ బిల్డర్స్ నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ సబ్ రిజిస్టర్ కార్యాలయానికి సోమవారం మంత్రి శంకుస్థాపన చేశారు. స్థానిక ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ప్రజలకు సౌకర్యం పరిపాలనకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అత్యధిక సౌకర్యాలతో కార్పొరేట్ స్థాయి ప్రమాణాలతో సమీకృత సబ్ రిజిస్టర్ కార్యాలయాలను రాష్ట్రవ్యాప్తంగా దశలవారీగా నిర్మిస్తున్నామని మంత్రి తెలిపారు. మొదటి దశలో ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలో, రెండో దశలో జిల్లా కేంద్రంలో, మూడో దశలో నియోజకవర్గ కేంద్రాల్లో సమీకృత భవనాలు నిర్మిస్తామని వెల్లడించారు.మొదటి దశలో ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలోని హైదరాబాదు రంగారెడ్డి మేడ్చల్ సంగారెడ్డి నాలుగు జిల్లాల్లోని 33 సబ్ రిజిస్టర్ కార్యాలయాలను 12 కష్టాలుగా విభజించి భవనాలు నిర్మిస్తున్నామని తెలిపారు.
ఇప్పటికే గచ్చిబౌలిలోని తెలంగాణ అకాడమీ ఆఫ్ ల్యాండ్ ఇన్ఫర్మేషన్ అండ్ మేనేజ్మెంట్ భవనంలో సమీకృత సబ్ రిజిస్టర్ కార్యాలయ నిర్మాణానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా శంకుస్థాపన చేయడం జరిగిందని, జూన్ నాటికి భవనాన్ని ప్రారంభించుకుంటామని వెల్లడించారు. ప్రభుత్వంపై ఆర్థిక భారం పడకుండా బిల్డర్స్ తోనే 12 సమీకృత భవనాలు నిర్మిస్తున్నామని తెలిపారు. అంతేగాక సమీకృత భవనాలు నిర్మించే సంస్థలే కనీసం ఐదేళ్లపాటు వాటిని నిర్వహించాలన్న నిబంధన కూడా పొందుపరచమని మంత్రి తెలిపారు ఇక్కడ కొత్తగా పెళ్లయి రిజిస్ట్రేషన్ కి వచ్చే జంటలు చిన్న పిల్లలతో వచ్చే తల్లులు పేదలకు సకల సౌకర్యాలు ఉంటాయని వెల్లడించారు ప్రభుత్వం రిజిస్ట్రేషన్ శాఖను ఆదాయవనరుగా కాకుండా సేవా కేంద్రంగా చూస్తుందని స్పష్టం చేశారు గత రెండేళ్లుగా రాష్ట్ర వ్యాప్తంగా కేవలం రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు డబ్బు చేకూర్చాలని ఆలోచన కాకుండా పేదవారిని దృష్టిలో పెట్టుకొని వివిధ సంస్కరణ తెచ్చామని మంత్రి తెలిపారు .పేదలకు గతంలో ఇచ్చిన భూములతో పాటు ప్రభుత్వ భూములను పరిరక్షిస్తామని, ప్రభుత్వ భూములను చెరబట్టే అక్రమార్కులను ఉక్కు పాదంతో అణచివేస్తామని వెల్లడించారు. ప్రతిపక్షాలతో విమర్శించుకునే పరిషత్ రాకుండా పేదల పక్షాన ప్రభుత్వం పని చేస్తుందని స్పష్టం చేశారు .
ఒకప్పుడు పేదలకు పంపిణీ చేసిన భూములను అసైన్డ్ భూములను ఒకవేళ ప్రభుత్వం తీసుకోవాలనుకున్న వారికి తగిన పరిహారం ప్రత్యామ్నాయ స్థలము మంజూరు వంటి చర్యలు తప్పనిసరిగా ఉంటాయన్నారు. త్వరలో జరిగే పోయే మేడారం జాతర కోసం భారీ నిర్మాణాలతో ఆధునికరించామని ప్రజలు ఈ జాతరకు రావాలని మంత్రి పొంగులేటి కోరారు .ఈ కార్యక్రమంలో మల్కాజిగిరి పార్లమెంటు సభ్యులు ఈటల రాజేందర్, కుకట్ పల్లి శాసనసభ్యులు మాధవరం కృష్ణారావు, శాసనమండలి విప్ పట్నం మహేందర్రెడ్డి, ఎమ్మెల్సీ నవీన్ రావు, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వడ్డేపల్లి రాజేశ్వరరావు, కూకట్పల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ బండి రమేష్, కార్పొరేటర్లు పడాల శిరీష బాబురావు, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ ఐజి రాజీవ్ గాంధీ హనుమంతు, మల్కాజ్గిరి మేడ్చల్ జిల్లా అదనం కలెక్టర్ విజయేందర్ రెడ్డి. జిల్లా మార్కెటింగ్ చైర్మన్ నరసింహులు యాదవ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, భవన నిర్మాణాన్ని చేపడుతున్న డిఎస్‌ఆర్ నిర్మాణ సంస్థ అధినేత సుధాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.