
ముంబై: ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్లుపిఎల్) 2026 సీజన్‌లో ముంబై ఇండియన్స్ బోణీ కొట్టింది. తొలి మ్యాచ్‌లో ఓటమి నుంచి తేరుకున్న హర్మన్ సేన ఢిల్లీ క్యాపిటల్స్‌తో శనివారం జరిగిన మ్యాచ్‌లో 50 పరుగుల తేడాతో విజయం సాధించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ దిగిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 195 పరుగులు చేసింది. ముంబై బ్యాటర్లలో నాట్ స్కీవెర్(70), సారథి హర్మన్ ప్రీత్ సింగ్(74) బ్యాట్ ఝలిపించడంతో ముంబై భారీ స్కోరు చేయగలిగింది. అనంతరం 196 పరుగుల లక్ష ఛేదనకు దిగిన ఢిల్లీ ముంబై బౌలర్ల ధాటికి 145 పరుగులకే తోకముడిచింది. నికోలా క్యారీ (3/37), అమెలియా ఖేర్(3/24)లు బాల్‌తో ఢిల్లీ పతనాన్ని శాసించారు. దీంతో చినెల్లె హెన్రీ తప్ప ఢిల్లీ బ్యాటర్లలో మరెవరూ రాణించలేక పోయారు.