Reading Time: < 1 minute

కన్నడ స్టార్ హీరో యశ్ తాజాగా నటిస్తున్న చిత్రం టాక్సిక్. గీతూ మోహన్ దాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో నయనతార, రుక్మిణి వసంత్, కియారా అద్వానీ, తారా సుతారియా, హ్యూమా ఖురేషీ హీరోయిన్లుగా నటిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఐదుగురు హీరోయిన్ల పోస్టర్లు విడుదలైన మంచి స్పందనను తెచ్చుకున్నాయి. ఇక తాజాగా యశ్ పుట్టినరోజు కానుకగా రాయ ఇంట్రడక్షన్ గ్లింప్స్‌ని రిలీజ్ చేశారు. ఈ గ్లింప్స్‌లో యశ్.. కారులో ఒక అమ్మాయితో రొమాన్స్ చేస్తూ ఉంటాడు. కారులో హీరోతో రొమాన్స్ చేస్తున్న అమ్మాయే నటాలీ బర్న్. గ్లింప్స్ రిలీజ్ అయ్యాక ఈ బ్యూటీ ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది. నటాలీ బర్న్.. ఒక అమెరికన్, ఉక్రెయిన్ నటి. హాలీవుడ్‌లో యాక్షన్, థ్రిల్లర్ మూవీస్‌లో నటించి మెప్పించింది. ఆమె నిర్మాతగా కూడా పలు సినిమాలను తెరకెక్కించింది.