Reading Time: < 1 minute

అమరావతి: తన ప్ర‌వ‌ర్త‌న‌పై తాడిపత్రిలో జనవరి 1న నిరాహార దీక్ష చేయబోతున్నానని టిడిపి నేత జెసి ప్రభాకర్ రెడ్డి సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న‌ చేశారు. తాడిపత్రి ప్రజల్లో తనపై భిన్నాభిప్రాయం ఉందని, తాను ఇలా ప్రవర్తించడానికి కారణమేంటో తెలపడానికే దీక్ష చేస్తున్నానని వివరణ ఇచ్చాడు. తాను ప్రవర్తించిన తీరు మంచిదా కాదా అని ప్రజల్ని అడగాలనుకుంటున్నానని, మంచిది కాదంటే తన ప్రవర్తన మార్చుకోవడానికి సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు. 2026లో తాడిపత్రిని ఇంకా అభివృద్ది చేయాలనే కోరిక తనలో ఉందన్నారు. మాజీ ఎంఎల్‌ఎ కేతిరెడ్డి పెద్దారెడ్డి, జెసి ప్రభాకర్ రెడ్డి వర్గీయుల మధ్య కొంత కాలంగా రాజకీయంగా యుద్ధం నడుస్తున్న విషయం తెలిసింది. తాడిపత్రిలో ఒకరిని ఒకరు కవ్వించుకుంటున్న విషయం విధితమే. ఇద్దరు నాయకులు రోడ్డెక్కితే తాడిపత్రిలో టెన్షన్ టెన్షన్ నెలకొంటుంది.