
అమరావతి: రూ.50 పందెం కోసం పెన్ను మింగి ఓ విద్యార్థి ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు. ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుంటూరు జిల్లాలో జరిగింది. వైద్యులు తెలిపిన వివరాల ప్రకారం… కొత్తపేటలో శ్రీనివాసరావు, లక్ష్మీ అనే దంపతులు నివసిస్తున్నారు. ఈ దంపతుకలు మురళీ కృష్ణ అనే కుమారుడు (16) ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. మురళీ కృష్ణ తొమ్మిదో తరగతి చదువుతున్నప్పుడు రూ.50 కోసం స్నేహితులతో పందెం కట్టాడు. పెన్ను మింగితే రూ.50 ఇస్తానని స్నేహితులు చెప్పడంతో వెంటనే పెన్నును మింగిడు.
గత కొంత కాలంగా కడుపులో నొప్పి వస్తుండడంతో తల్లిదండ్రులకు చెప్పకుండా దాచాడు. డిసెంబర్ 18న కడుపు నొప్పి ఎక్కువగా ఉండడంతో మూడేళ్ల కిందట పెన్ను మింగిన విషయాన్ని స్నేహితుల తల్లిదండ్రులకు చెప్పాడు. వెంటనే కుమారుడిని జిజిహెచ్ ఆస్పత్రికి తరలించారు. ఆస్ప్రతిలో వైద్యులు స్కాన్ చేసి చూడగా వస్తువు ఉన్నట్టు గుర్తించారు. రెట్రో గ్రేడ్ ఎంటెర్ స్కోపీ విత్ ఓవర్ ట్యూబ్‌తో పెన్ను బయటకు తీశారు. ఆపరేషన్ లేకుండా పెన్నును బయటకు తీయడంతో తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేశారు. వైద్య బృందాన్ని ఆస్పత్రి వర్గాలు, స్థానికులు, మీడియా అభినందించారు.