Reading Time: 2 minutes

Nayanthara TOXIC: పాన్ ఇండియా స్క్రీన్‌పై యశ్–నయనతార.. స్టైలిష్‌ లుక్‌లో అదరగొట్టిన లేడీ సూపర్ స్టార్

Caption of Image.

పాన్‌‌ ఇండియా స్టార్‌‌‌‌గా ఎదిగిన కన్నడ హీరో యశ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘టాక్సిక్‌‌’. లేడీ డైరెక్టర్ గీతూ మోహన్ దాస్ తెరకెక్కిస్తుంది. KVN ప్రొడక్షన్స్‌‌ నిర్మిస్తున్న ఈ మూవీకి యశ్‌‌ కూడా నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. 2026 మార్చి 19న వరల్డ్‌‌వైడ్‌‌గా విడుదల కానుంది. ఇప్పటికే, టాక్సిక్‌‌ ఫస్ట్ లుక్ పోస్టర్,గ్లింప్స్ రిలీజ్ చేయడంతో భారీ అంచనాలు పెరిగాయి. ఈ క్రమంలో వరుస పోస్టర్స్ రిలీజ్ చేస్తూ క్యూరియాసిటీ పెంచుతున్నారు. 

ఇటీవలే, టాక్సిక్ నుండి బాలీవుడ్‌‌‌‌లో క్రేజీ స్టార్ హుమా ఖురేషి పాత్రను రివీల్ చేస్తూ పోస్టర్ రిలీజ్ చేశారు. ఇందులో ఆమె ఎలిజిబెత్‌‌‌‌గా కనిపించనుందని తెలియజేశారు. ఈ క్రమంలోనే లేటెస్ట్గా యశ్ సరసన నటించబోయే ఇండియా లేడీ సూపర్ స్టార్ నయనతార లుక్ రివీల్ చేశారు. టాక్సిక్లో నయనతారను “గంగ”గా పరిచయం చేస్తూ క్రేజీ పోస్టర్ పంచుకున్నారు. క్యారెక్టర్‌‌‌‌‌‌‌‌ పేరుకు భిన్నంగా  నయనతార ఫస్ట్ లుక్ రిలీజ్ చేయడం ఆసక్తిగా ఉంది. గ్లామరస్ డ్రెస్‌లో స్టైలిష్‌గా నిలబడి ఉన్న నయనతార లుక్ అభిమానులను ఆకట్టుకుంటోంది.

నయనతార 2026 సినిమాలు:

హీరోయిన్‌‌‌‌గా ఎంట్రీ ఇచ్చి ఇరవై ఏళ్లు దాటినా ఇప్పటికీ అదే గ్లామర్‌‌‌‌‌‌‌‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది నయనతార. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో వరుస ఆఫర్స్‌‌‌‌తో దూసుకెళుతోంది నయన్.  ‘టాక్సిక్‌‌‌‌’ తో పాటుగా తెలుగులో చిరంజీవి సరసన ‘మన శంకర వరప్రసాద్ గారు’, బాలకృష్ణతో “NBK111”, మలయాళంలో మోహన్ లాల్ తో ఓ మూవీ, మహాశక్తి 2 (మూకుతి అమ్మన్ 2), డియర్ స్టూడెంట్స్ వంటి తదితర సినిమాలు చేస్తోంది. 

ఇకపోతే, గీతు మోహన్ దాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో యశ్​ తో పాటుగా కియారా అద్వానీ, హుమా ఖురేషి, నయనతార, తారా సుతారియా, రుక్మిణి వసంత్, అక్షయ్ ఒబెరాయ్, సుదేవ్ నాయర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

©️ VIL Media Pvt Ltd.