Reading Time: < 1 minute
Nani: కెరీర్ స్పీడు పెంచిన నేచురల్ స్టార్

కాలక్షేపం చేయడానికి, కాసింత సేద తీరడానికి టైమ్‌ లేదని స్ట్రెయిట్‌గా చెప్పేస్తున్నారు నేచురల్‌ స్టార్‌ నాని. ఇప్పుడు సెట్స్ మీద ఉన్నదేంటి? నెక్స్ట్ సెట్‌ చేయాల్సింది ఏంటి? అంటూ స్పీడో మీటర్‌ వేగం పెంచేస్తున్నారు. ఇంతకీ ఏం జరుగుతోంది నేచురల్‌ స్టార్‌ కెరీర్‌లో. సరిపోదా శనివారం, హిట్‌ ది థర్డ్ కేస్‌.. సినిమాల వైబ్‌ని ఇంకా ఎంజాయ్‌ చేస్తున్నారు నేచురల్‌ స్టార్‌ ఫ్యాన్స్. మరోవైపు ది ప్యారడైజ్‌ మూవీ కోసం ఇష్టంగా ఎదురుచూస్తున్నారు. నాని కెరీర్‌ని మాస్‌ బాట పట్టించిన కెప్టెన్‌ చేస్తు్న్న సినిమా, అందులోనూ జడల్‌ రోల్‌లో దుమ్ములేపుతున్న నాని లుక్స్.. వాళ్లల్లో ప్యారడైజ్‌ మీద బజ్‌ పెంచేస్తున్నాయి. ప్రస్తుతం ప్యారడైజ్‌ షూట్‌ స్పీడుగా సాగుతోంది. రీసెంట్‌గా రిలీజ్‌ అయిన ఆయా షేర్‌కి మంచి స్పందన వస్తోంది. సో, మిగిలిన షూట్‌ని కూడా త్వరలోనే పూర్తి చేయాలని అనుకుంటున్నారు నాని. జూన్‌ నుంచి బ్లడీ రోమియో సెట్స్ కి వెళ్లాలన్నది నేచురల్‌ స్టార్‌ ప్లానింగ్‌. ఈ మూవీ యానిమేటెడ్‌ అనౌన్స్ మెంట్‌ టీజర్‌ని ఇష్టంగా చూసేస్తున్నారు అభిమానులు. సుజీత్‌ డైరక్షన్‌లో స్టైలిష్‌ గ్యాంగ్‌స్టర్‌ యాక్షనర్‌గా తెరకెక్కనుంది బ్లడీ రోమియో. సుజీత్‌ సినిమాటిక్‌ యూనివర్శ్‌లో ఉంటుందనే టాక్‌ కూడా వినిపిస్తోంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఉస్మానియా బిస్కెట్లు ఇష్టంగా తింటున్నారా.. ఇది చూడండి

తండ్రికి ప్రేమగా మిల్క్‌ షేక్‌ అందించి.. అనంత లోకాలకి పంపిన కుమార్తె..

ఇంటి ఆడపడుచులా.. గోమాతకు సీమంతం !!

చిన్న తప్పుతో నడవలేని స్థితికి చేరుకున్న.. హృతిక్‌ ప్రియురాలు

నచ్చకపోతే నచ్చలేదని చెప్పాలి కానీ.. ఇలా చేస్తారా ??