Reading Time: < 1 minute
Dry Days April 2026 Liquor Shop Holidays India List

Liquor Shop Holidays: ఏప్రిల్ నెలలో ఏదైనా పార్టీలు ప్లాన్ చేస్తున్నారా.. అయితే ఈ వార్త మీ కోసమే. ఏప్రిల్‌లో దేశవ్యాప్తంగా పలు కీలక సందర్భాల్లో మద్యం విక్రయాలపై నిషేధం ఉండనుందని తెలుస్తుంది. ముఖ్యంగా గుడ్ ఫ్రైడే, అంబేద్కర్ జయంతి వంటి కీలక రోజుల్లో వైన్ షాపులు క్లోజ్ కానున్నాయని సమాచారం.

READ ALSO: CSK Vs RR: చెన్నై పరువు కాపాడిన స్టార్ బౌలర్ ఓవర్టన్.. స్వల్ప స్కోర్‌కే కుప్పకూలిన గైక్వాడ్ సేన..

ఏప్రిల్‌లో డ్రై డేస్ లీస్ట్ ఇదే..
ప్రభుత్వ నిబంధనల ప్రకారం.. ఈ తేదీలలో మద్యం దుకాణాలు మూసివేసే అవకాశం ఉంది. ఏప్రిల్ 3 (శుక్రవారం) గుడ్ ఫ్రైడే సందర్భంగా దేశవ్యాప్తంగా డ్రై డే ఉండే అవకాశం ఉంది. అలాగే ఏప్రిల్ 10 (శుక్రవారం) మహావీర్ జయంతిని పురస్కరించుకుని అనేక రాష్ట్రాల్లో మద్యం అమ్మకాలు నిలిపివేయవచ్చు. ఏప్రిల్ 14 (మంగళవారం) డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ జయంతి సందర్భంగా ప్రభుత్వ ఆదేశాల మేరకు మద్యం దుకాణాలు మూతపడతాయని సమాచారం.

అసలు ‘డ్రై డే’ అంటే..
ప్రభుత్వం అధికారికంగా మద్యం అమ్మకాలను నిషేధించే రోజులను ‘డ్రై డేస్’ అంటారు. ఈ రోజుల్లో వైన్ షాపులు, బార్‌లు, పబ్‌లు, క్లబ్‌లు, రెస్టారెంట్లు మద్యం విక్రయించడానికి వీల్లేదు. లైసెన్స్ ఉన్న సంస్థలు కూడా ఈ నియమాన్ని పాటించాల్సి ఉంటుంది. నిజానికి దేశవ్యాప్తంగా డ్రై డే రూల్స్ ఒకేలా ఉండవు. స్థానిక పండుగలు, సంప్రదాయాలు, ఆయా రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయాలను బట్టి ఈ జాబితాలో మార్పులు ఉండవచ్చు. కాబట్టి, మీ ప్లాన్లలో ఎలాంటి అంతరాయం కలగకుండా ఉండాలంటే, ఈ తేదీలను ముందే గుర్తుంచుకోవడం మంచిది.

READ ALSO: Iran: అణు బాంబు దిశగా ఇరాన్ ముందడుగు.. ప్రపంచ దేశాల్లో వణుకు!