Reading Time: 2 minutes

IPL 2026: టాస్ ఓడిన చెన్నై సూపర్ కింగ్స్.. బౌలింగ్ చేయనున్న రాజస్థాన్.. 

Caption of Image.

IPL 2026: ఐపీఎల్ 2026 సీజన్ ఆరంభంలోనే ఒక ఆసక్తికరమైన పోరుకు తెరలేచింది. గౌహతిలోని బర్సపరా స్టేడియం వేదికగా రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ జట్లు తలపడుతున్నాయి. ఈ కీలక మ్యాచ్‌లో టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్ మొదట ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. గౌహతిలో వర్షం కారణంగా పిచ్‌పై తేమ ఉండే అవకాశం ఉందని భావించిన జట్టు ఈ నిర్ణయం తీసుకుంది. రాజస్థాన్ కెప్టెన్ రియాన్ పరాగ్ మాట్లాడుతూ.. మేము మొదట బౌలింగ్ చేస్తున్నాము. ఇక్కడ భారీగా వర్షం కురిసింది, కాబట్టి పిచ్‌లో కొంత తేమ ఉంటుంది. ఈ జట్టుకు నాయకత్వం వహించడం చాలా ఆనందంగా ఉంది, మాకు ఈ స్టేడియంలో మద్దతు అద్భుతంగా లభిస్తుంది. ఈ సీజన్‌లో మా లక్ష్యం ఒక్కటే అది ట్రోఫీని గెలవడమని పేర్కొన్నారు. అందుకోసం తెలివైన క్రికెటర్లను జట్టులోకి తీసుకున్నామని రియాన్ పరాగ్ చెప్పాడు. 
 
ఇరు జట్లు: 
చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ మాట్లాడుతూ.. ముందుగా బౌలింగ్ చేయడం సరైన నిర్ణయమని పేర్కొన్నారు. గత సీజన్‌లో ఎదురైన అనుభవాలను గుర్తు చేసుకుంటూ, ఈసారి మంచి ఆరంభం చేయాలని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆటగాళ్ల ఎంపిక విషయంలో కూడా స్పష్టమైన వ్యూహంతో వేలానికి వెళ్లినట్లు చెప్పారు. జట్టు మంచి ప్రదర్శన చేయాలని ఆశాభావం వ్యక్తం చేశారు. టాస్ ఓడిపోవడంతో చెన్నై సూపర్ కింగ్స్ ముందుగా బ్యాటింగ్ చేయనుంది. వర్షం కారణంగా అవుట్‌ఫీల్డ్ నెమ్మదిగా ఉండే అవకాశం ఉంది. ప్రారంభ ఓవర్లలో బౌలర్లకు పిచ్ సహకరించే అవకాశం ఉంది. 

చెన్నై సూపర్ కింగ్స్ (ప్లేయింగ్ XI): సంజు శాంసన్, రుతురాజ్ గైక్వాడ్(సి), ఆయుష్ మ్హత్రే, మాథ్యూ షార్ట్, శివమ్ దూబే, కార్తీక్ శర్మ(w), జామీ ఓవర్టన్, నూర్ అహ్మద్, మాట్ హెన్రీ, అన్షుల్ కాంబోజ్, ఖలీల్ అహ్మద్

రాజస్థాన్ రాయల్స్ (ప్లేయింగ్ XI): యశస్వి జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ, రియాన్ పరాగ్(సి), ధృవ్ జురెల్(w), షిమ్రాన్ హెట్మెయర్, రవీంద్ర జడేజా, జోఫ్రా ఆర్చర్, నాంద్రే బర్గర్, సందీప్ శర్మ, రవి బిష్ణోయ్, బ్రిజేష్ శర్మ 

©️ VIL Media Pvt Ltd.