Reading Time: < 1 minute

హైదరాబాద్: ఎంఎల్‌ఎ దానం నాగేందర్ 2 కోట్ల లంచం అడిగినట్లు మాట్లాడిన ఆడియోపై విచారణ జరిపించాలని సిపిఎం డిమాండ్ చేసింది. బిల్డింగ్ పర్మిషన్ కోసం బిల్డర్ దగ్గర రూ.2 కోట్లు లంచం అడిగినట్లు ఖైరతాబాద్ ఎంఎల్‌ఎ దానం నాగేందర్ మాట్లాడిన ఆడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోందని, ఈ అంశంపై సమగ్ర విచారణ జరిపించి దోషులను చట్ట ప్రకారం కటినంగా శిక్షించాలని సిపిఎ గ్రేటర్ హైదరాబాద్ సెంటురల్ కమిటీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఎంఎల్‌ఎ దానం నాగేందర్ తనకు ఇప్పటికే 25 లక్షలు ముట్టినట్టు మాట్లాడారని, ఇందులో కొంతమంది ప్రభుత్వ అధికారులకు డబ్బులు ఇచ్చినట్టు అంటున్నారని ఆయనన్నారు. ఈ అంశంలో ఎవరి పాత్ర ఎంత ఉన్నది అనేది బయటికి రావాలన్నారు.