Reading Time: < 1 minute
Pawan Kalyan: బరి’లోకి దిగిన పవర్‌స్టార్‌.. వైరల్‌ అవుతున్న బ్రో సినిమా సీక్వెల్‌ న్యూస్‌

రాఖీభాయ్‌కి వయొలెన్స్ అంటే ఇష్టం ఉండదు. కానీ, వయొలెన్స్ కి మాత్రం రాఖీభాయ్‌ అంటే ఇష్టం. ఇక్కడ ఈ విషయాన్ని వపన్‌ కల్యాణ్‌కీ, ఆయనకున్న క్రేజ్‌కీ పోల్చి చెప్పుకోవచ్చండోయ్‌. పవన్‌ కల్యాణ్‌ క్రేజ్‌ గురించి పట్టించుకోరు. కానీ, క్రేజ్‌ మాత్రం పవన్‌ కల్యాణ్‌కి దూరంగా అసలు ఉండలేదు.. అంతేనంటారా? కమాన్‌.. ఈ స్టోరీ చూసేద్దాం.. చేతినిండా ఎన్ని పనులున్నా, చేసిన సినిమాకు న్యాయం చేయాలని పవన్‌ కల్యాణ్‌ ప్రమోషన్లలో పాల్గొన్న తీరు జనాలను ఫిదా చేసింది. హరిహరవీరమల్లు, ఓజీ, రీసెంట్‌గా వచ్చిన ఉస్తాద్‌ భగత్‌సింగ్‌.. సినిమా ఏదైనా ముందు నిలుచుని ప్రమోట్‌ చేశారు పవర్‌స్టార్‌. ఆయన అలా సినిమా వేడుకల్లో ఉంటే చూడ్డానికి సందడిగా ఉందంటూ నెక్స్ట్ సినిమాల మీద ఇష్టంగా మాట్లాడుకోసాగారు జనాలు. నెక్స్ట్ ఏ సినిమా చేసినా నేను చెబుతానని అభిమానులకు మనసులోని మాటలను చెప్పేశారు పవర్‌స్టార్‌. సినిమాల గురించి ఆయన మాట్లాడకపోయినా, సినిమాల పరంగా ఎక్కడో చోట ఆయన పేరు వినిపిస్తూనే ఉంది. బ్రో సినిమాకు సీక్వెల్‌ ఉంటుందా? అని రీసెంట్ గా సముద్రఖనికి ఓ ప్రశ్న ఎదురైంది. స్క్రిప్ట్ రెడీ.. అన్నయ్య గ్రీన్‌ సిగ్నల్‌ ఇస్తే ఏదైనా సాధ్యం అనేశారు సముద్రఖని. అలా ఓ సారి వైరల్‌ అయ్యారు పవన్‌ అండ్‌ బ్రో సీక్వెల్‌. వరుణ్‌ తేజ్‌ హీరోగా నీహారిక కొణిదెల దర్శకత్వంలో రూపొందుతోంది బరి మూవీ. ఈ సినిమా ప్రారంభోత్సవానికి వచ్చి అన్నయ్య పిల్లలిద్దరినీ ఆశీర్వదించారు పవర్‌స్టార్‌. ఆయన రాకతో ఓపెనింగ్‌ సెరమనీకి పవర్‌ఫుల్‌ వైబ్‌ వచ్చిందని ఆనందం వ్యక్తం చేసింది టీమ్‌. సో..ఇదన్నమాట.. సినిమాలకూ, పవర్‌స్టార్‌కూ ఉన్న అద్భుతమైన క్రేజీ రిలేషన్‌ అంటూ ఇష్టంగా మాట్లాడుకుంటున్నారు పవన్‌ సైనికులు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఉస్మానియా బిస్కెట్లు ఇష్టంగా తింటున్నారా.. ఇది చూడండి

తండ్రికి ప్రేమగా మిల్క్‌ షేక్‌ అందించి.. అనంత లోకాలకి పంపిన కుమార్తె..

ఇంటి ఆడపడుచులా.. గోమాతకు సీమంతం !!

చిన్న తప్పుతో నడవలేని స్థితికి చేరుకున్న.. హృతిక్‌ ప్రియురాలు

నచ్చకపోతే నచ్చలేదని చెప్పాలి కానీ.. ఇలా చేస్తారా ??