
మన తెలంగాణ/హైదరాబాద్ : క్యాతన్ పల్లి మున్సిపాలిటీ తో పాటు ఖానాపూర్, ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీల చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికకు ముహూర్తం ఖరారు. హైకోర్టు ఆదేశాల ప్రకారం గడువు ముగుస్తున్న నేపథ్యములో రాష్ట్ర ఎన్నికల కమిషన్ షెడ్యూల్ విడుదల చేసింది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని అధికారిక ప్రకటన విడుదల చేశారు. ఏప్రిల్ 4 వ తేదీన చైర్మన్ ,వైస్ చైర్మన్ ఎన్నిక జరపనున్నట్టు వెల్లడిం చారు. కాగా ఆయా చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలపై బిఆర్‌ఎస్ న్యాయపోరాటం చేసిన విషయం విదితమే.