Reading Time: 2 minutes

IPL 2026: బ్యాటింగ్లో చేతులెత్తేసిన చెన్నై.. రాజస్థాన్ ముందు స్వల్ప టార్గెట్!

Caption of Image.

IPL 2026: ఐపీఎల్ 2026లో భాగంగా గౌహతిలో రాజస్థాన్ రాయల్స్ (RR)తో జరుగుతున్న పోరులో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) ఆలౌట్ అయింది. కేవలం 19. 4  ఓవర్లు ఆడిన చెన్నై 127 పరుగులు మాత్రమే చేసింది. సీఎస్కే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ (6), స్టార్ ఓపెనర్ సంజు శాంసన్ (6), ఆయూష్ మాత్రే (0), మాథ్యు షార్ట్(2) లాంటి టాప్ ఆర్డర్ బ్యాటింగ్ విఫలమవడంతో పవర్‌ప్లేలోనే కీలకమైన నాలుగు వికెట్లను చెన్నై జట్టు కోల్పోయి తీవ్ర నిరాశ పరిచారు. ఇక టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన సీఎస్కే జట్టుకి ఆశించిన స్థాయిలో ఆరంభం లభించ లేదు. వర్షం కారణంగా పిచ్‌పై ఉన్న తేమను రాజస్థాన్ రాయల్స్ బౌలర్లు చక్కగా వినియోగించుకున్నారు.

ఇంపాక్ట్ ప్లేయర్ గా వచ్చిన సర్ఫరాజ్ ఖాన్ (17) సైతం పెద్దగా ఇంపాక్ట్ చూపించలేదు.. క్రీజులో ఉన్నంత సేపు బ్యాట్ ఝలిపించే ప్రయత్నం చేసినప్పటికీ 17 పరుగులు చేసి రవీంద్ర జడేజా బౌలింగ్ లో  ఔట్ అయ్యాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన శివమ్ దూబే (6) వచ్చి రావడంతోనే భారీ సిక్సు కొట్టి మంచి ఊపుమీద కనిపించినప్పటికీ ఆ తర్వాత బంతికే భారీ షాట్ ఆడే ప్రయత్నం చేసి బౌండరీ లైన్ వద్ద రవి బిష్ణోయ్ కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ కి వెళ్లిపోయాడు. 

ఇక రాజస్థాన్ రాయల్స్ తరపున తొలి ఐపీఎల్ మ్యాచ్ ఆడుతున్న బ్రిజేష్ శర్మ.. క్రీజులో కుదరుకున్నట్లు కనిపించిన కార్తీక్ శర్మ (18)ని ఎల్బీడబ్ల్యూ ఔట్ చేశాడు. దీంతో ఆరంగేట్రం మ్యాచులోనే ఫస్ట్ వికెట్ తీసుకుని తన ఖాత ఓపెన్ చేశాడు. అనంతరం వచ్చిన నూర్ ఆహ్మద్ (1) సైతం ఒక పరుగు చేసి జోఫ్రా ఆర్చర్ బౌలింగ్ లో అవుట్ అయ్యాడు. ఆ తర్వాత బ్యాటింగ్ కి వచ్చిన మ్యాట్ హెన్రీ (5) కూడా ఎక్కువ సేపు మైదానంలో నిలవలేక డగౌట్ కి వెళ్లిపోయాడు. చివర్లో జేమీ ఓవర్టన్– అన్షుల్ కాంబోజ్ ఆచితూచి బ్యాటింగ్ చేయడంతో సీఎస్కే గౌరవప్రదమైన స్కోర్ చేసింది. ఇక చెన్నై సూపర్ కింగ్స్ జట్టు 10వ వికెట్  మధ్య భాగస్వామ్యం 32 పరుగులు వచ్చింది.  సీఎస్కే జట్టులో జేమీ ఓవర్టిన్ ఒక్కడే 43 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. ఇక రాజస్థాన్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్, నాంద్రే బర్గర్, రవీంద్ర జడేజా తలో రెండు వికెట్లు పడగొట్టగా, సందీప్ శర్మ, బ్రిజేష్ శర్మ, రవి బిష్ణోయ్ చెరో వికెట్ తీసుకున్నారు.  

 

©️ VIL Media Pvt Ltd.