Reading Time: < 1 minute
ఈ  చిలుకకు ప్రాణం వచ్చి ఎగిరిపోతే  యుగాంతమే..  ఎక్కడో తెలుసా

భారతదేశంలో అనేక వింతలు విశేషాలు ఉన్నాయి. అంతేకాకుండా ఆధ్యాత్మికంగా భారతదేశం ఎంతో గొప్పది పురాణాల ప్రకారం అనేక వాస్తవాలు కూడా ఉన్నాయి. చాలా వరకు అవి నిజనిర్ధారణ కూడా అయ్యాయి. అయితే ఇప్పుడు అలాంటి ఒక ఆసక్తికరమైన విషయం ఉంది అదేంటంటే ఇప్పుడు నేను చెప్పబోయే చిలకకు పాపాగ్ని నది నీరు తగిలితే యుగాంతమే అంట.. దీనికి స్థల పురాణం కూడా ఉంది.. అసలు ఇంతకీ ఏమిటి ఆ స్థల పురాణం అంటే ఏంటో ఇక్కడ చూద్దాం..

కడప జిల్లా కమలాపురం నియోజకవర్గంలోని శ్రీ సంగమేశ్వర దేవాలయంలో ఒక ఆసక్తికరమైన స్థలపురాణం ఉంది.. సంగమేశ్వర దేవాలయానికి ముందు ఉండే ధ్వజస్తంభంపై చిట్ట చివరన ఒక చిలుక ఉంటుంది అయితే ఆ చిలుకకు సంగమేశ్వర దేవాలయం పక్కనే ఉన్నటువంటి పాపాగ్ని నది నీరు తగిలి ఆ చిలుకకు ప్రాణం వచ్చి ఎగిరిపోతే యుగాంతం అవుతుందని స్థలపురాణం చెబుతుంది… అయితే దీనికి సంబంధించి బ్రహ్మంగారి కాలజ్ఞానం లో కూడా రాసి ఉందని దేవాలయ పూజారి చెప్తున్నారు .. విజయవాడలోని కనకదుర్గమ్మ ముక్కుపుడకకు కృష్ణా నది నీరు తగిలితే ప్రళయం వస్తుందని ఏ విధంగా ప్రచారం ఉందో అదే విధంగా కడప జిల్లాలోని శ్రీ సంగమేశ్వర దేవాలయానికి కూడా అటువంటి కథే ఉంది. ఇక్కడ ధ్వజస్తంభంపై చిట్ట చివరన ఉన్న చిలుకకు గనక పెన్నా నది నీరు తగిలి చిలుకకు ప్రాణం వచ్చి ఎగిరిపతే యుగాంతమేనట. ఎంతో ప్రతిష్టాత్మకమైన ఈ దేవాలయం అనేక విశేషాలకు ప్రత్యేకత చెందింది కూడా ఏది ఏమైనా సంగమేశ్వర దేవాలయంలోకి అడుగుపెడితే ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. కోరిన కోర్కెలు నెరవేరుతాయని ప్రతీతి.