
ఇరాన్‌కు మరోసారి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరిక
చమురు, ఇంధన, మౌలిక సదుపాయాలను ధ్వంసం చేస్తానని వార్నింగ్
మరింత తీవ్రమయిన గల్ఫ్ యుద్ధం
కువైట్‌పై ఇరాన్ దాడుల్లో భారతీయుడు మృతి
ఇజ్రాయెల్ అణు చమురు కేంద్రాలపై ఇరాన్ దాడులు
పాక్ మధ్యవర్తిత్వానికి ఇరాన్ తిరస్కరణ
వాషింగ్టన్: ఇరాన్ వెంటనే హర్మూజ్ జలసంధిని రాకపోకలకు తిరిగి తెరవాలని, లేకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఇరాన్‌ను అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించా రు. ముందు హర్మూజ్ ఓపెన్ చేయండి లేకపో తే ఇరాన్ చమురు, ఇంధన మౌలిక సదుపాయాలపై భీకర దాడులు తప్పవని సోమవా రం హెచ్చరించారు. ఇరాన్‌కు చెందిన అత్యంత కీలకమైన స్థావరాలను ఎంచుకుని దాడు లు జరుగుతాయని తెలిపిన ట్రంప్ పరోక్షంగా తమ పదాతిదళం ఇరాన్‌కు చెందిన ఖర్గ్ దీవిని స్వాదీనపర్చుకుంటుందని పేర్కొన్నారు. ఇంతకాలం చర్చల పురోగతి విషయం ప్రస్తావిస్తూ వచ్చిన ట్రంప్ ఇప్పుడు తీవ్రస్థాయి హెచ్చరికలకు దిగా రు.
అమెరికా ఇప్పుడు ఇరాన్‌లోని సముచిత, సహేతుక అధికారిక వ్యవస్థతతో గణనీయ చ ర్చలలో ఉంది. తమ సైనిక చర్యల నిలిపివేత దిశలో ఈ చర్చలు సాగుతున్నాయని చెప్పిన ట్రంప్, ఇవి ఇరాన్‌కు అత్యంత కీలకం కానున్నాయని విశ్లేషించారు. ఈ చర్చలు ఫలించకపోయినా, హర్మూజ్ తిరిగి ప్రారంభించకపోయినా అమెరికా నుంచి ఇరాన్ స్థావరాలపై ఉధృత దాడులు తప్పవని ట్రంప్ తమ ట్రూత్ సోషల్ మీడియా ద్వారా తెలిపారు. ఇప్పటికైతే చర్చలలో పురోగతి ఉందని, డీల్ కుదిరే అవకాశం ఉందని ప్రకటించారు. ఇరాన్ ఇకపై తమ దేశ విద్యుత్ ఉత్పాదక స్థావరాలు పనిచేయాలనుకున్నా, ఖర్గ్ ఐటాండ్‌లోని చమురు బావులు నిలబెట్టుకోవాలనుకున్నా డీల్‌కు దిగిరావాల్సిందే అని స్పందించారు. పలు రకాలుగా ఇరాన్‌ను స్తంభింపచేయడం జరుగుతుంది. అక్కడి జలశుద్ధి కేంద్రాలను కూడా దెబ్బతీస్తామని , ఇప్పటివరకూ తాము ఈ డిసాలినేషన్ ప్లాంట్స్ జోలికి వెళ్లలేదని గుర్తుచేశారు. 47 సంవత్సరాల ఇరాన్ గత ఉగ్రపాలకుల చర్యలతో మృతి చెందిన అమెరికన్లకు సరైన నివాళిగా ఇప్పటి చర్చలు నిలుస్తాయని తెలిపారు. ఈ విషయంపై దృష్టి సారిస్తే సంతోషం అని కూడా తన సహజధోరణిలో వ్యాఖ్యానించారు. చర్చలు, భీకర దాడుల హెచ్చరికలతో ట్రంప్ ఒకే సారి పరస్పర వైఖరిని చాటారు.
ఖర్గ్‌ను స్వాధీనపర్చుకోవచ్చు లేదా వదిలేయవచ్చు అంటూనే ఇరాన్‌ను దారికి తీసుకువచ్చేందుకు అమెరికా వద్ద పలు మార్గాలు ఉన్నాయని తెలిపారు. సోమవారం నుంచి 20 వరకూ అమెరికా చమురు ట్యాంకర్ నౌకలను హర్మూజ్ నుంచి తరలించేందుకు ఇరాన్ అంగీకరించిందని కూడా వెల్లడించారు. ఇది తమ పట్ల ఇరాన్‌కు ఉన్న గౌరవంగా భావిస్తున్నామని తెలిపారు. దాదాపుగా పాతికవేల వరకూ అమెరికా మెరైన్లు ఈ ప్రాంతంలో మొహరించి ఉన్నా, మరికొందరు ఇక్కడికి చేరుకుంటూ ఉన్నా ఇరాన్ ఈ దశలో సానుకూలరీతిలో స్పందించడం తాము గుర్తించామని పేర్కొన్నారు. ఏది ఏమైనా ఇరాన్ చేయాల్సింది చేయాల్సి ఉంటుంది. లేకపోతే అమెరికా దీనికి బదులుగా ఏమి చేయాలో అదే చేసి తీరుతుందని తన సొంత వేదిక ద్వారా ప్రస్తావించారు.
గల్ఫ్ యుద్ధం మరింత ప్రజ్వలనం
అమెరికా వైమానిక స్థావరాలు ఉన్న గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడులు సోమవారం కూడా తీవ్రస్థాయిలో సాగాయి. దీని ప్రభావంతో ఈ ప్రాంతంలో ఉద్రిక్తతలు, గగనతల అభద్రత మరింత పెరిగింది. ప్రస్తుత దశలో తమ దేశ గగనతలం నుంచి అమెరికా యుద్ధ విమానాలను అనుమతించేది లేదని స్పెయిన్ అధికారికంగా ప్రకటించింది. ఇరాన్‌తో యుద్థానికి వాడే అమెరికా విమానాలకు తమ దేశం అనుమతి నిరాకరిస్తున్నట్లు స్పెయిన్ రక్షణ మంత్రి మార్గరిటా రోబ్లెస్ సోమవారం మాడ్రిడ్‌లో చెప్పారు. ఇక్కడ అమెరికాతో కలిసి స్పెయిన్ సంయుక్త సైనిక స్థావరాలను నిర్వహిస్తోంది. వీటిని ఇరాన్‌పై దాడులకు వినియోగిస్తే తమ భద్రతకు భంగకరం అని స్పెయిన్ ఆందోళన వ్యక్తం చేసింది. యుద్ధం ఆరంభం నుంచే తాము అమెరికాకు ఈ విషయంలో స్పష్టంగా తెలియచేస్తున్నామని స్పెయిన్ రక్షణ మంత్రి మీడియాకు వివరించారు.
కువైట్‌పై ఇరాన్ దాడులు .. భారతీయుడు కృష్ణన్ దుర్మరణం
ఇరాన్ కువైట్‌పై సోమవారం జరిపిన దాడులలో ఓ భారతీయ వ్యక్తి మృతి చెందారు. ఆయనను సంతాన్ సెల్వం కృష్ణన్‌గా గుర్తించారు. ఇక్కడ డిశాలినేషన్ ప్లాంట్‌లో పనిచేస్తున్న కృష్ణన్ ఇరాన్ క్షిపణి దాడులలో మృతి చెందారు. ఈ ప్రాంతంలోనే పది మంది సైనికులు గాయపడ్డారు. కువైట్‌లోని జలశుద్ధి కేంద్రం, విద్యుత్ కేంద్రంపై ఇరాన్ దాడులు జరిగిన విషయాన్ని కువైట్‌లోని భారతీయ ఎంబసీ వర్గాలు సోమవారం తెలిపాయి. ఇరాన్ ఆటవిక దాడికి దిగిందని కువైట్ విద్యుత్, జలవనరులు, ప్రత్నామ్నాయ ఇంధన మంత్రిత్వశాఖ గర్హించింది. ఇప్పుడు జరిగిన దాడిలో మరో భారతీయుడి మృతితో గల్ఫ్ యుద్ధం మొదలైన నాటి నుంచి గల్ఫ్ ప్రాంతంలో చనిపోయిన భారతీయుల సంఖ్య ఎనిమిదికి చేరుకుంది. ఈ విషయాన్ని న్యూఢిల్లీలో భారతీయ విదేశాంగ మంత్రిత్వశాఖ అధికారులు ధృవీకరించారు. దుబాయ్, కువైట్, రియాద్ ఇతర ప్రాంతాల్లో జరిగిన దాడులలో క్షిపణి శకలాల ధాటికి చనిపోయిన వారిలో భారతీయులు కూడా ఉన్నారు. ఆయా ప్రాంతాలలో భారతీయల పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ , తగు సాయం అందించేందుకు 24 గంటలు పనిచేసే కంట్రోలు రూంలు సిద్ధంగా ఉన్నాయని అధికారులు తెలిపారు.
ఇజ్రాయెల్ అణు , చమురు కేంద్రాలపై ఇరాన్ దాడులు
ఇరాన్ తమ దేశ ప్రతీకార దాడులలో భాగంగా ఇజ్రాయెల్ ప్రధాన మౌలిక సదుపాయాల వ్యవస్థలపై దాడులకు దిగింది. ఇజ్రాయెల్‌కు చెందిన ప్రధాన అణు పరిశోధనా కేంద్రం వద్ద సోమవారం పెద్ద ఎత్తున సైరన్ మోతలు విన్పించాయి. ఈ కేంద్రాన్ని ఇరాన్ తరచూ లక్షంగా చేసుకుని దాడులకు దిగుతోంది. ఇరాన్ మద్దతు గల యెమెన్ మిలిటెంట్ల నుంచి తమ స్థావరాలపై దాడులు జరిగిన విషయాన్ని ఇజ్రాయెల్ సైన్యం ధృవీకరించింది.తరువాత ఇజ్రాయెల్‌లోని హైఫాలో ఉన్న చమురు శుద్ధి కర్మాగారంపై కూడా ఇరాన్ దాడులు జరిగాయి. ఇక్కడ చెలరేగిన మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.
యుఎఇ నుంచి 85 విమానాలు
దాదాపు 85 విమానాల రాకపోకలు అరబ్ ఏమిరేట్స్ నుంచి భారత్‌కు సోమవారం నుంచి ఆరంభం కానున్నాయి. సౌదీ అరేబియాలోని పలు విమానాశ్రయాల నుంచి , ఒమన్ నుంచి భారత్‌లోని పలు ప్రాంతాలకు విమాన సర్వీసులు ఆరంభం అయ్యాయి. ఖతార్ విమానాశ్రయాన్ని పాక్షికంగా తెరిచారు. ఖతార్ ఎయిర్‌వేస్ సోమవారం పది వరకూ విమానాలను భారత్‌కు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసుకుంది. కువైట్, బహరైన్ గగనతలాల మూసివేత కొనసాగుతోంది. కువైట్‌కు చెందిన జజీరా ఎయిర్‌వేస్ , బహరైన్‌కు చెందిన గల్ఫ్ ఎయిర్ సంస్థ తమ విమానాలను సైదీ అరేబియాలోని పలు విమానాశ్రయాల నుంచి అనిర్ణీత షెడ్యూల్స్‌గా భారత్‌కు నిర్వహిస్తోంది. భారతీయ ప్రయాణికులను ముందుగా ఇరాన్‌కు చేర్చి, అక్కడి నుంచి సురక్షిత మార్గాలలో దేశానికి తీసుకువస్తారు. ఇజ్రాయెల్ ఇతర ప్రాంతాలలోని వారు, ఇరాన్ దాడులకు గురవుతున్న ప్రాంతాల్లోని భారతీయులు ఏదో విధంగా ఇరాన్ చేరుకుంటే అక్కడి నుంచి భారత్‌కు రావడానికి వీలేర్పడుతుంది.