
గువాహటి: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 19వ సీజన్‌లో మరో ఆసక్తికర మ్యాచ్‌కు సమయం ఆసన్నమైంది. బర్సాపరా స్టేడియం వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌తో రాజస్థాన్ రాయల్స్ జట్టు తలపడనుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన రాజస్థాన్ జట్టు తొలుత బౌలింగ్ చేసేందుకు ముందుకొచ్చింది. ఈ ఏడాది రవీంద్ర జడేజా చెన్నై నుంచి రాజస్థాన్‌కి, సంజూ శాంసన్ రాజస్థాన్ నుంచి చెన్నైకి ట్రేడ్ అయిన విషయం తెలిసిందే. దీంతో ఈ మ్యాచ్‌లో వాళ్ల మాజీ జట్టుపై ఈ ఆటగాళ్లు ఎలా ప్రదర్శిస్తారా..? అనే ఆసక్తి నెలకొంది.
తుది జట్లు:
సిఎస్‌కె: సంజూ శాంసన్(కీపర్), రుతురాజ్ గైక్వాడ్(కెప్టెన్), ఆయుష్ మాత్రే, మ్యాథ్యూ షార్ట్, శివమ్ దూబే, కార్తీక్ శర్మ, జేమీ ఓవర్‌టన్, నూర్ అహ్మద్, మ్యాట్ హెన్రీ, అన్షుల్ కాంబోజ్, ఖలీల్ అహ్మద్.
ఆర్ఆర్: యశస్వీ జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ, రియాన్ పరాగ్(కెప్టెన్), ధృవ్ జురేల్(కీపర్), షిమ్రాన్ హెట్మైర్, రవీంద్ర జడేజా, జోఫ్రా ఆర్చర్, నండ్రే బర్గర్, సందీప్ శర్మ, రవి బిష్ణోయ్, బ్రిజేశ్ శర్మ.